Kuwait: తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమలైతే రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు పండగే..!

ABN , First Publish Date - 2022-03-08T17:52:23+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్‌లో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది.

Kuwait: తెరపైకి కొత్త ప్రతిపాదన.. అమలైతే రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు పండగే..!

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్‌లో తెరపైకి ఓ కొత్త ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన కనుక అమలైతే రెసిడెన్సీ ఉల్లంఘనలకు పాల్పడిన వారికి పండగనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రెసిడెన్సీ ఉల్లంఘటనలకు పాల్పడిన వారిని ఎలాంటి జరిమానాలు చెల్లించకుండా కువైత్ విడిచి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలనేది ఆ కొత్త ప్రతిపాదనగా తెలుస్తోంది. అంతర్గత మంత్రిత్వశాఖకు చెందిన రెసిడెన్సీ అఫైర్స్ విభాగం దీన్ని ప్రతిపాదించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇలా చేయడం ద్వారా భారీ సంఖ్యలో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారు కువైత్ వదిలి వెళ్లిపోతారని సంబంధిత అధికారులు తమ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ ప్రతిపాన కనుక అమలైతే మాత్రం రెసిడెన్సీ ఉల్లంఘనదారులకు మంచి అవకాశం అనే చెప్పాలి. ఎందుకంటే ఉల్లంఘనలకు పాల్పడినవారు ఒక్క పైసా కూడా ఫైన్ కట్టకుండా స్వదేశానికి వచ్చేయవచ్చు. కాగా, అధికారిక సమాచారం ప్రకారం కువైత్‌లో ప్రస్తుతం 1.50 లక్షల మంది ఉల్లంఘనదారులు చట్ట విరుద్ధంగా నివాసం ఉంటున్నట్లు తెలిసింది. ఇక ఇంతకుముందు కూడా కువైత్ సర్కార్ పలుమార్లు ఉల్లంఘనదారులకు ఇలాంటి అవకాశాలు కల్పించిన విషయం విదితమే.      


Updated Date - 2022-03-08T17:52:23+05:30 IST