అమెరికాలో అద్భుతం.. వందేళ్ల క్రితం మాయమైన చేప.. సడన్‌గా ప్రత్యక్ష్యం..!

ABN , First Publish Date - 2022-09-30T01:10:03+05:30 IST

అరుదైన వస్తువులు, జంతువులు.. ఒక్కోసారి అనుకోకుండా వెలుగులోకి వస్తుంటాయి. అమెరికాలో ప్రస్తుతం ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. వందేళ్ల క్రితం మాయమైన ఓ చేప సడన్‌గా..

అమెరికాలో అద్భుతం.. వందేళ్ల క్రితం మాయమైన చేప.. సడన్‌గా ప్రత్యక్ష్యం..!

అరుదైన వస్తువులు, జంతువులు.. ఒక్కోసారి అనుకోకుండా వెలుగులోకి వస్తుంటాయి. అమెరికాలో ప్రస్తుతం ఇలాంటి అరుదైన ఘటన చోటు చేసుకుంది. వందేళ్ల క్రితం మాయమైన ఓ చేప సడన్‌గా ప్రత్యక్ష్యమైంది. స్థానిక వార్తా కథనాల ప్రకారం.. మైనింగ్ కాలుష్యం, చేపల వేట పెరిగిపోవడం తదితర కారణాలతో ఈ రకం చేప అంతరించిపోయిందట. ఈ జాతి చేప ఉనికి కనిపెట్టేందుకు సుమారు పదేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఎట్టకేలకు ఈ చేప బయటపడడం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇందుకు సబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


అమెరికాలోని (America) కొలరాడోలో ఈ ఘటన చోటు చేసుకుంది. సౌత్ ప్లాట్ అనే ప్రాంత సమీపంలోని జలాల్లో నట్టటి మచ్చలతో ఉన్న అరుదైన చేప దొరికింది. దీన్ని స్వాధీనం చేసుకున్న స్థానికులు అధికారులకు అప్పగించారు. దాన్ని పరిశీలించిన అధికారులు.. వందేళ్ల క్రితం అంతరించిపోయినా అరుదైన చేపగా గుర్తించారు. వివిధ కారణాలతో 1930లలో ఈ చేప అంతరించిపోయిందని అధికారులు తెలిపారు. గ్రీన్‌బ్యాక్ కట్‌త్రోట్ ట్రౌట్ (Greenback cutthroat trout) అని పిలవబడే ఈ చేపలు సహజంగా సంతానోత్పత్తి చేసుకోగలవని చెప్పారు. 2012లో సెంట్రల్ కొలరాడోలోని బేర్ క్రీక్‌లో వీటి ఉనికి కనుగొన్నారు. తర్వాత దాని స్పెర్మ్, గుడ్ల నమూనాలను సేకరించారు. అప్పటి నుంచి ఈ జాతి చేపలను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఈ చేపలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.

Viral Video: రైల్లో మొబైల్ కొట్టేయాలని చూసిన దొంగకు చుక్కలు చూపించిన ప్రయాణీకులు.. తలుపుల వద్దే బయటకు వేళాడదీసి..





Updated Date - 2022-09-30T01:10:03+05:30 IST