చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స

ABN , First Publish Date - 2022-08-08T04:38:58+05:30 IST

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారికి అరుదైన శస్త్ర జరిగింది.

చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స
చిన్నారితో పీడీయాట్రిక్‌ సర్జరీ హెచవోడీ డా.శివకుమార్‌

  1. అడ్వాన్స ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా చెడిపోయిన కిడ్నీ తొలగింపు
  2.  రాష్ట్రంలోనే మొట్టమొదటి ఆపరేషన అంటున్న వైద్యులు 

కర్నూలు(హాస్పిటల్‌), ఆగస్టు 7: కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ చిన్నారికి అరుదైన శస్త్ర జరిగింది. అడ్వాన్స ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా వైద్యులు చెడిపోయిన కిడ్నీ తొలగించారు. చిన్నారి డిశ్చార్జి కావడంతో ఆదివారం ఆ వివరాలను వైద్యులు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా అలంపూర్‌కు చెందిన 9 నెలల చిన్నారి స్మిత కుడి కిడ్నీ పూర్తిగా చెడిపోయింది. దీంతో గత నెల 17వ తేదీన కర్నూలు జీజీహెచలోని చిన్న పిల్లల సర్జరీ విభాగంలో చిన్నారిని తల్లిదండ్రులు అడ్మిట్‌ చేశారు. గత నెల 29వ తేదీన అడ్వాన్స ల్యాప్రోస్కోపిక్‌ ద్వారా శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఇటువంటి అడ్వాన్స శస్త్ర చికిత్స రాష్ట్రంలోనే  మొట్టమొదటిసారిగా కర్నూలు జీజీహెచలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పీడియాట్రిక్‌ సర్జరీ హెచవోడీ డా.శివకుమార్‌ అన్నారు. ఈ శస్త్ర చికిత్సలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా.సునీల్‌ కుమార్‌ రెడ్డి, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డా.గ్రేస్‌, డా.నరేష్‌, డా.మధు, మత్తుమందు వైద్యులు డా.హరినాథ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-08T04:38:58+05:30 IST