చోరీ చేయాలని షాపులోకి చొరబడ్డ దొంగలు.. గన్‌తో బెదిరించిన వెంటనే లోపలి వ్యక్తి నుంచి షాకింగ్ రియాక్షన్..!

ABN , First Publish Date - 2021-10-24T00:58:27+05:30 IST

అది యూఎస్‌ యుమాలోని ఓ గ్యాస్ స్టోర్. అప్పుడే నేవీ విభాగానికి చెందిన ఓ మాజీ ఉద్యోగి లోపలికి వెళ్లి షాపు నిర్వాహకులతో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు దొంగలు ఆవేశంగా లోపలికి వచ్చారు. వారిలో ఓ దొంగ గన్ తీసి బెదిరించాడు.

చోరీ చేయాలని షాపులోకి చొరబడ్డ దొంగలు.. గన్‌తో బెదిరించిన వెంటనే లోపలి వ్యక్తి నుంచి షాకింగ్ రియాక్షన్..!

ఒక పనిని పర్‌ఫెక్ట్‌గా చేయాలంటే.. అందులో కనీసం కాసింతైనా అనుభవం ఉండాలి. అప్పుడే అనుకున్న పని, అనుకున్న సమయానికి పూర్తవుతుంది. అది మంచి పనైనా, దొంగ పనైనా గానీ.. సూత్రం మాత్రం ఒక్కటే. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. యూఎస్‌‌లో అనుభవం లేని ఇద్దరు దొంగలు చేసిన పని చూస్తే మీకే అర్థమవుతుంది. ఆవేశంగా దొంగతనానికి వచ్చి ఇద్దరు దొంగలు.. చివరకు అబాసుపాలయ్యారు. చోరీ మాట అటుంచి.. బతుకుజీవుడా అంటూ అక్కడి నుంచి పరుగందుకున్నారు. నవ్వుల పవ్వులు పూయిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. 


అది యూఎస్‌ యుమాలోని ఓ జనరల్ స్టోర్. అప్పుడే నేవీ విభాగానికి చెందిన ఓ మాజీ ఉద్యోగి లోపలికి వెళ్లి షాపు నిర్వాహకులతో మాట్లాడుతున్నాడు. కొద్ది సేపటికి ఇద్దరు దొంగలు ఆవేశంగా లోపలికి వచ్చారు. వారిలో ఓ దొంగ గన్ తీసి బెదిరించాడు. బెదిరిపోయి డబ్బులు కుమ్మరిస్తారని అనుకున్న ఆ దొంగలకు.. నేవీ మాజీ ఉద్యోగి చుక్కలు చూపించాడు. ఏమాత్రం భయపడకుండా.. దొంగ చేతిని పట్టుకుని ఒక్క తోపు తోసేస్తాడు.


దెబ్బకు ఆ దొంగతో పాటూ ఇంకో దొంగ కూడా దూరంగా ఎగిరిపడ్డారు. ఇక వెనక్కు తిరిగి చూడకుండా... అక్కడి నుంచి కాళ్లకు బుద్ధి చెప్పారు. ఈ వీడియో చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ‘‘ ఈ దొంగలకు అనుభవం తక్కువ, తొందర ఎక్కువ.. అంటుంటే, మరికొందరు నేవీ మాజీ ఉద్యోగి రియల్ హీరో.. అంటూ ప్రశంసిస్తున్నారు. 



Updated Date - 2021-10-24T00:58:27+05:30 IST