ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ABN , First Publish Date - 2021-03-01T06:01:33+05:30 IST

మండలంలోని చినమాదారం గ్రామ జడ్పీహెచ్‌ఎ్‌స 1994 -95బ్యాచ్‌ విద్యార్థులు పట్టణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సమ్మేళనానికి హాజరైన పూర్వ విద్యార్థులు

నల్లగొండ రూరల్‌ : మండలంలోని చినమాదారం గ్రామ జడ్పీహెచ్‌ఎ్‌స 1994 -95బ్యాచ్‌ విద్యార్థులు పట్టణంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాద్యాయులు జోగరెడ్డి, సత్యనారాయణరెడ్డి, కృష్ణారెడ్డి మాట్లాడుతూ విద్యను నేర్పిన గురువును గుర్తు పెట్టుకొని గౌరవించినందుకు ఈ అనుభూతిని మరువలేమని అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి వారి చిన్పప్పటి మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకొని అనందించారు. కార్యక్రమంలో నిర్వాహకులు సైదులు, యాదగిరిరెడ్డి, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T06:01:33+05:30 IST