మూడేళ్లలో వేయని రోడ్డు.. రెండేళ్లలో ఎలా వేస్తారు?

ABN , First Publish Date - 2022-08-12T09:00:39+05:30 IST

మూడేళ్లలో వేయని రోడ్డు.. రెండేళ్లలో ఎలా వేస్తారు?

మూడేళ్లలో వేయని రోడ్డు.. రెండేళ్లలో ఎలా వేస్తారు?

పెనుకొండ ఎమ్మెల్యేను నిలదీసిన పెద్దకోడిపల్లి వాసులు

రొద్దం, ఆగస్టు 11: శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దకోడిపల్లిలో రోడ్డు విషయమై పెనుకొం డ ఎమ్మెల్యే శంకర నారాయణను ప్రజలు నిలదీశా రు. గడప గడపకు మన ప్రభు త్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి గురువారం సాయంత్రం ఎమ్మెల్యే వెళ్లారు. బస్టాండుకు ఎదురుగా ఉన్న వీధిలో రోడ్డు సౌకర్యం ఎప్పుడు కల్పిస్తారని మహిళలు, యువకులు ఎమ్మెల్యేను నిలదీశారు. త్వరలోనే పనులు చేపడతామని ఎమ్మెల్యే చెప్పగా.. ‘అధికారం చేపట్టి మూడేళ్లయినా రోడ్డు వేయలేదు. ఇంక మిగిలిన రెండేళ్లలో ఏం చేస్తారు..?’ అని మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. వీధిలైట్లు వెలగక చాలాకాలం అయ్యిందని, విద్యుత్‌ సరఫరాలో అం తరాయం కలుగుతోందని, ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పారు. దీంతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరయ్యారు. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తానంటూ ముందుకు వెళ్లిపోయారు.

Updated Date - 2022-08-12T09:00:39+05:30 IST