అనంతసాగరం పోస్టాఫీసుకు తాళం

Published: Tue, 17 May 2022 22:03:45 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 అనంతసాగరం పోస్టాఫీసుకు తాళంతపాలా కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలుపుతున్న యజమాని

అనంతసాగరం, మే 17: అనంతసాగరం పోస్టాఫీసుకు మంగళవారం తాళం పడింది. ఈ కార్యాలయాన్ని బీసీ కాలనీలోని అద్దె గృహంలో నిర్వహిస్తున్నారు. అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తైనా ఖాళీ చేయలేదని భవన యజమాని రాకేష్‌ తాళం వేసి నిరసన తెలిపాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ భవనాన్ని 2015లో  ఐదేళ్ల కాలపరిమితితో పోస్టాఫీసుకు అద్దెకు ఇచ్చామని, 2020కి కాలపరిమితి పూర్తైనా కార్యాలయం ఖాళీ చేయలేదని వాపోయాడు. ఈ విషయమై జిల్లా, రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తిరిగి అగ్రిమెంటు చేసుకోకుండా, భవనం ఖాళీ చేయకపోవడం ఎంతవరకు సమంజసమన్నారు.  వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశాడు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.