విద్యార్థులను సన్మానిస్తున్న దృశ్యం

ABN , First Publish Date - 2022-07-05T07:38:03+05:30 IST

జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌ జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల నందు 2021-22 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాఽధించిన విద్యార్థులను సోమవారం సన్మానించారు.

విద్యార్థులను సన్మానిస్తున్న దృశ్యం
విద్యార్థులను సన్మానిస్తున్న దృశ్యం

పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీలో మున్సిపల్‌ చైర్మన్‌

నిర్మల్‌ చైన్‌గేట్‌, జూలై 4 : జిల్లాకేంద్రంలోని మంజులాపూర్‌ జిల్లా పరి షత్‌ ఉన్నత పాఠశాల నందు 2021-22 ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఉత్తమ ఫలి తాలు సాఽధించిన విద్యార్థులను సోమవారం సన్మానించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మున్సిపల్‌ చైర్మన్‌గండ్రత్‌ ఈశ్వర్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన పాఠ్య పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ చేశారు. ఇటీవల ఎస్‌ఎస్‌సీ ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులకు మున్సిపల్‌ చైర్మన్‌ శాలువాతో సన్మానించారు. మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ విద్యా రంగాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రభుత్వబడుల్లో కార్పొరేట్‌ విద్యాసంస్థ లాగా ధీటుగా విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అన్నారు. గౌరవరాష్ట్ర మంత్రి వర్యులు అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సహకారంతో జిల్లాలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను, ల్యాబ్స్‌, అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించే విధంగా ముందుకెళ్తున్నామన్నారు. పాఠశాల మైదానాన్ని పరిశీలించి, శానిటేషన్‌ పరంగా పాఠశాల ఆవరణలో మౌళిక సదుపాయాలు కల్పిస్తాం అన్నారు. ఇదే విధంగా ఉపాధ్యాయులు బోధించే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని పరీక్షల్లో ఉత్తమమైన మార్కులు సాధించి, తల్లిదండ్రులకు, పాఠశాలకు, జిల్లాకు మంచిపేరు తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పద్మ, స్థానిక కౌన్సిలర్లు, పాఠశాల చైర్మన్‌ గోవర్ధన్‌, రిటైడ్‌ ఉపాధ్యాయులు జనార్ధన్‌, నాగరాజు, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-05T07:38:03+05:30 IST