పిడుగు పడి గొర్రెలకాపరి మృతి

ABN , First Publish Date - 2022-07-02T05:48:12+05:30 IST

మండలంలోని కుమారాం గ్రామ సమీపంలో ఉన్న పిన్నింటివారి చెరువు వద్ద గొర్రెలు కాస్తున్న కాపరులపై పిడుగు పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయప డ్డారు.

పిడుగు పడి గొర్రెలకాపరి మృతి

శృంగవరపుకోట రూరల్‌ (జామి): మండలంలోని కుమారాం గ్రామ సమీపంలో ఉన్న పిన్నింటివారి చెరువు వద్ద గొర్రెలు కాస్తున్న కాపరులపై పిడుగు పడింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయప డ్డారు. ఈ ఘటనపై వీఆర్వో రాంబాబు, ఏఎస్‌ఐ నర్శింగరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కుమారాం గ్రామానికి చెందిన కొయ్యాన సన్యాసి(61), కొయ్యాన అప్పలనాయుడు తమ గొర్రెలను మేత కోసం పిన్నింటివారిచెరువు సమీపంలోకి తీసుకెళ్లారు. మధ్యాహ్నం ఉరుములతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. వీరి సమీపంలో ఒక పిడుగు పడడంతో సన్యాసి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అప్పలనాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. అప్పలనాయుడిని విజయనగరం మహా రాజ ఆసుపత్రికి తరలించారు. జామి పోలీసులు కేసు నమోదుచేశారు.

ఓ ఆవు..

గరుగుబిల్లి:  కొత్తూరులో పిడుగు పాటుకు ఆవు మృతి చెందింది.  శివ్వానికి చెందిన కేండ్రు లక్ష్ముం గ్రామంలో మేత లేకపోవడంతో కొత్తూరుకు చెందిన బర్ల రాముకు ఆవును అప్పగించారు. అయితే మేతకు తొలుకువెళ్లిన సమయంలో పిడు గు పడడంతో ఆవు మృతి చెందింది. ఇదిలా ఉండగా మండలంలో శుక్రవారం సా యంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. పక్కా కాలువలు లేకపోవడంతో గొట్టివలస గ్రామంలోని రోడ్డుపై వర్షం నీరు కదలలేదు. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. వర్షం కారణంగా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచింది.

 

Updated Date - 2022-07-02T05:48:12+05:30 IST