Viral Video: ఎంత ముద్దొస్తోందో.. అంటూ పాము తలపై ముద్దుపెట్టబోయిన యువతి.. ఏం జరిగిందో చూడండి..!

Published: Sat, 11 Dec 2021 16:33:49 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఎంత ముద్దొస్తోందో.. అంటూ పాము తలపై ముద్దుపెట్టబోయిన యువతి.. ఏం జరిగిందో చూడండి..!

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పాములంటే అందరికీ భయమేస్తుంది. వాటిని చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. అవి కంటపడితే చాలు.. ఆమడ దూరం పారిపోతాం. పాములను పట్టేవాళ్లతోపాటు మరికొందరు మాత్రమే.. వాటిని ధైర్యంగా ఎదుర్కొని, రకరకాల విన్యాసాలు చేస్తారు. అయితే ఇపుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామనేగా డౌట్.. అందుకు ఓ పెద్ద కారణమే ఉంది. ఇంట్లో పెంచుకుంటున్న కుక్క పిల్లను ముద్దు చేసినట్టు.. ఓ యువతి ఏకంగా పామునే ముద్దడబోయింది. అయితే అది షాకింగ్ రియాక్షన్ ఇవ్వడంతో.. సదరు యువతి భయంతో కేకలు పెట్టింది. ఇంతకీ ఏం జరిగిందంటే..


కొండ చిలువ జాతికి చెందిన భారీ సర్పాన్ని ఓ వ్యక్తి.. తన చేతిలో బంధించి అందరికీ చూపిస్తుండగా అక్కడకు ఓ యువతి వెళ్తుంది. పామును దగ్గర నుంచి చూసి, తెగ సంబరపడి పోతుంది. అంతేకాకుండా ఒక అడుగు ముందుకేసీ ‘ఎంత ముద్దొస్తోందో’ అంటూ పాము తలపై ముద్దుపెట్టేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో తలను వెనక్కితప్పిన ఆ పాము.. తన నోటితో సదరు యువతి మూతిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ యువతి.. భయంతో కేకలు వేసింది. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. ‘అది కచ్చితంగా మగ పామే అయ్యింటుంది’ అంటూ ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 




Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.