అమృతరావుకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-10-17T06:24:34+05:30 IST

విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని తన ప్రాణాన్నే అడ్డంపెట్టి నిరాహారదీక్ష చేసిన మహోన్నత వ్యక్తి టి.అమృతరావు అని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు

అమృతరావుకు ఘన నివాళి
అమృతరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు

ఉక్కుటౌన్‌షిప్‌, అక్టోబరు 16: విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని తన ప్రాణాన్నే అడ్డంపెట్టి నిరాహారదీక్ష చేసిన మహోన్నత వ్యక్తి టి.అమృతరావు అని ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ స్థాపన కోసం ఉద్యమం ప్రారంభించి, 55 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృతరావు విగ్రహానికి శుక్రవారం పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 21 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ప్లాంట్‌ను సాధించటంలో ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఏవీ రమణారావు, జె.అయోధ్యరామ్‌, గంధం వెంకటరావు, వై.మస్తానప్ప, జెర్రిపోతుల మోహన్‌కుమార్‌, బొండా యల్లాజీరావు, రాధాకృష్ణ, డీవీ రమణ, బలిరెడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-17T06:24:34+05:30 IST