మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-06T04:59:29+05:30 IST

ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం బాధాకరమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు.

మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి
హుస్నాబాద్‌లో రోశయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

హుస్నాబాద్‌, డిసెంబరు 5: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య అకాల మరణం బాధాకరమని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. ఆదివారం హుస్నాబాద్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి కేడం లింగమూర్తి, సింగల్‌ విండో చైర్మన్‌ బొల్లిశెట్టి శివయ్య, జిల్లా నాయకులు కోమటి సత్యనారాయణ, హసన్‌, పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్‌, మండలాధ్యక్షులు బంక చందు, మాజీ  సర్పంచ్‌ బొంగోని శ్రీనివాస్‌, రాష్ట్ర మహిళ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు బోనగిరి రజిత, నాయకులు బురుగు కిష్టస్వామి, పోశెట్టి, పెరమండ్ల నర్సాగౌడ్‌, రవీందర్‌రెడ్డి, సుధాకర్‌, సావుల వెంకట్‌, సాగర్‌యాదవ్‌, పున్న రంజిత్‌, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.


కాంగ్రెస్‌ పార్టీకి తీరని లోటు


కొండపాక, డిసెంబరు 5: రోశయ్య అకాల మరణం పార్టీకి తీరని లోటని కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు విరుపాక శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లింగారావు, జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.


రోశయ్య సేవలు ఎనలేనివి


నారాయణరావుపేట, డిసెంబరు 5: ఉమ్మడి ఏపీ సీఎంగా రోశయ్య సేవలు ఎనలేనివని కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ మండలాధ్యక్షుడు బింగి యాదగిరి అన్నారు. ఆదివారం లక్ష్మీదేవిపల్లి గ్రామంలో రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు రాజేశంగౌడ్‌, నాయకులు పాతూరి రాజిరెడ్డి, అంజిరెడ్డి, లక్ష్మయ్య, పెంటయ్య, మల్లయ్య, దండు రాజు తదితరులు పాల్గొన్నారు.


ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో


మద్దూరు, డిసెంబరు 5: రోశయ్య మృతి పట్ల మద్దూరు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గుండా నర్సింగారావు, ఉపాధ్యక్షుడు చందా వెంకటేష్‌, మాజీ అధ్యక్షుడు రామాంజనేయులు, నాయకులు బుక్క అంతయ్య, చందా అశోక్‌, ఉప్పల కన్నయ్య పాల్గొన్నారు.


 

Updated Date - 2021-12-06T04:59:29+05:30 IST