రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-05-22T05:02:30+05:30 IST

భారత రత్న, దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం డీసీసీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి
మక్తల్‌లో రాజీవ్‌గాంధీ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న కాంగ్రెస్‌ శ్రేణులు

నారాయణపేట, మే 21 : భారత రత్న, దేశ మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ 32వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు శనివారం డీసీసీ కార్యాలయంలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. 

ధన్వాడ : మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం రాజీవ్‌గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మయ్యగౌడ్‌, మండల యూత్‌ అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్‌, ఇర్ఫాన్‌, మల్లేష్‌, శాహిద్‌, నాగరాజు, శ్రావణ్‌, వెంకట్‌రెడ్డి, నవీన్‌యాదవ్‌ పాల్గొన్నారు.

మరికల్‌ : మండల కేంద్రంలో కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు గొల్ల కృష్ణయ్య ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ చౌరస్తాలో మాజీ ప్రధానని రాజీవ్‌గాంఽధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొని యాడారు. అంజిరెడ్డి, గోవర్ధన్‌, వీరన్న, మొగులయ్య, చెన్నయ్య పాల్గొన్నారు.

మక్తల్‌  : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతిని పురస్కరించుకొని మండలంలోని వనాయకుంటలో రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల  వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నియోజకవర్గ నాయకులు రాజుల ఆశిరెడ్డి, వాకిటి శ్రీహరి  రాజీవ్‌ కృషిని కొనియాడారు. గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనకు వాకిటి శ్రీహరి రూ.10,116 వేలు అ దజేశారు. అంతకుముందు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే చేపట్టే కార్యక్రమాలు వివరించారు. బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సిములు, మండలాధ్యక్షుడు గణేష్‌కు మార్‌, పట్టణాధ్యక్షుడు రవికుమార్‌, నాయకులు నూరుద్దీన్‌, గోవర్ధన్‌, ఓబ్లేష్‌, ఆశప్ప, సందప్ప, గజ్జలప్ప, శంకర్‌, మొగిలప్ప పాల్గొన్నారు.



Updated Date - 2022-05-22T05:02:30+05:30 IST