Advertisement

సుభాష్‌ చంద్రబోస్‌కు ఘన నివాళి

Jan 23 2021 @ 23:54PM
జిల్లాకేంద్రంలో నివాళ్లు అర్పిస్తున్న న్యాయవాదులు, నాయకులు

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 23: జిల్లాకేంద్రంలోని సుభాష్‌నగర్‌లో గల సుభాష్‌చంద్రబోస్‌ విగ్రహానికి పలు సంఘాలు, సంస్థలు, పలు పార్టీల నాయకులు, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు, జాగృతి నాయకులు, జేసీఐ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

మెండోర : అఖండ భారతావని నిత్యస్ఫూర్తిదాయకుడు సుభాష్‌చంద్ర బోస్‌ అని ఎస్సై సురేష్‌ అన్నారు. శనివారం మెండోర, బుస్సాపూర్‌, వెల్క టూర్‌ గ్రామాల్లో నేతాజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సామ గం గారెడ్డి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

ఏర్గట్ల: మండల కేంద్రంలో శనివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు గుల్లె రాజారాం, పుల్లూరి గంగాధర్‌, కురాకుల భూమేష్‌, జైనొద్దీన్‌, జుంగల గణేష్‌ పాల్గొన్నారు.  

పెద్దబజార్‌: నేటి యుతకు నేతాజీ ఆదర్శప్రియుడని ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ జీవన్‌రావు, డాక్టర్‌ విశాల్‌ అన్నారు. శనివారం నగరంలోని ఖలీల్‌వాడీలో గల ఇందూరు న్యూరోసైక్రియాటి ఆస్పత్రిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ డాక్టర్లు వినోద్‌కుమార్‌ గుప్తా, తానా జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ అజ్జ శ్రీనివాస్‌, డాక్టర్‌ ద్వారాకదేవి పాల్గొన్నారు. సీపీఐ, ఏఐవైఎఫ్‌, డిహెచ్‌పీఎస్‌, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు.

వర్ని: స్థానిక ఆటోయూనియన్‌ ఆధ్వర్యంలో సుభాష్‌ చంద్రబోస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. కార్యక్రమంలో విండో మాజీ చైర్మన్‌ నేమాని వీర్రాజు, ముత్యాల కృష్ణ పాల్గొన్నారు. చం ద్రబోస్‌ విగ్రహానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు నివాళ్లు అర్పించారు. 

బోధన్‌రూరల్‌: కల్దూర్కి గ్రామంలో శనివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నానాపటేల్‌, ఎంపీటీ సీ రాజన్న, ఉపసర్పంచ్‌ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ధర్పల్ల్లి: మండల కేంద్రంలో ఆదివారం సుభాష్‌చంద్రబోస్‌ జయంతి జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జాగృతి రూరల్‌ కన్వీనర్‌ రాము తదితరులు పాల్గొన్నారు. 

పెర్కిట్‌: పెర్కిట్‌, మామిడిపల్లిలోని చంద్రబోస్‌ విగ్రహాలకు పూలమా ల వేసి జయంతిని నిర్వహించారు. బీజేపీ ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్‌చా ర్జి పొద్దుటూరి వినయ్‌రెడ్డి, జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు నూతుల శ్రీని వాస్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జెస్సు అనిల్‌, పట్టణ పాలెపు రాజు, ఆకుల రాజు, కలిగోట ప్రశాంత్‌ పాల్గొన్నారు. ఆలూర్‌లో ఇన్‌చార్జి హెచ్‌ఎం జగదీశ్వర్‌ ఆధ్వర్యంలో జయంతి నిర్వహించారు. 

ఇందల్వాయి : ఇందల్వాయి గ్రామంలో ముదిరాజ్‌ యంగ్‌స్టార్‌ యూత్‌ ఆధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూత్‌ అధ్యక్షుడు గుర్రపు మోహన్‌, ఉపాధ్యక్షుడు గోపి,  సభ్యులు అశోక్‌, దాసు, సతీష్‌, స్వామి, నవీన్‌ పాల్గొన్నారు. 

డిచ్‌పల్లి: ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో బోస్‌ విగ్రహానికి విండో చైర్మన్‌ గజవాడ జయపాల్‌ పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కిష్టారెడ్డి, శ్రీనివాస్‌రావు, ముదిరాజ్‌ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 

నవీపేట: ఫకీరాబాద్‌లో నేతాజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ హరీష్‌కుమార్‌, సందీ ప్‌, రాహుల్‌, ధర్మనాయక్‌, దయానంద్‌, లచ్చరాం పాల్గొన్నారు. 

బాల్కొండ : వన్నెల్‌(బి) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి బట్టు రాజేశ్వర్‌ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షుడు పోతరాజు, హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

సిరికొండ : సిరికొండలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆ ధ్వర్యంలో నేతాజీ విగ్రహానికి సర్పంచ్‌ పూలమాల వేసి నివాళులు అర్పిం చారు. మండల అధ్యక్షుడు రాచర్ల గంగాధర్‌, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌ : శనివారం టీడీపీ కార్యాలయంలో సుభాష్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు దేగాం యాదాగౌడ్‌, జిల్లా అధికార ప్రతినిధి వినోద్‌కు మార్‌, నర్సింలు, అంబిక సత్యనారాయణ, శంకర్‌, రవి పాల్గొన్నారు.  

నిజామాబాద్‌ కల్చరల్‌ : శబ్దతరంగిణి సంస్థ ఆధ్వర్యంలో నాయకులు సుభాష్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు ద యానంద్‌, ప్రకాష్‌గౌడ్‌, రాజ్‌కుమార్‌ సుబేదార్‌ పాల్గొన్నారు. భారత్‌ స్వాభిమాన్‌ ట్రస్ట్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు బుచ్చన్న, లిం బాద్రి, సత్యనారాయణగౌడ్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. 

Follow Us on:
Advertisement