సురవరం ప్రభాకర్‌రెడ్డికి ఘన నివాళి

ABN , First Publish Date - 2022-05-20T05:14:35+05:30 IST

సురవరం ప్రభాకర్‌ రెడ్డి పార్టీకి చేసిన సేవలు చిరస్మ రణీయమని సీసీఐ రాష్ట్ర కా ర్యదర్శి నారాయణ అన్నారు.

సురవరం ప్రభాకర్‌రెడ్డికి ఘన నివాళి
సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ కార్యదర్శి నారాయణ

అలంపూర్‌ చౌరస్తా, మే 19 : సురవరం ప్రభాకర్‌ రెడ్డి పార్టీకి చేసిన సేవలు చిరస్మ రణీయమని సీసీఐ రాష్ట్ర కా ర్యదర్శి నారాయణ అన్నారు. గురువారం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచు పాడు గ్రామంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సోదరుడు సురవరం ప్రభాకర్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ ప్రభాకర్‌రెడ్డితో కలిసి పని చేశానని, ఆయన లేకపోవడం బాధాకర మని అన్నారు. గ్రామ సర్పంచుగా గ్రామాభివృద్ధికి పాటుపడ్డారని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ అన్నారు. అంతకుముందు అయన చిత్రపటానికి సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, బాల్‌నరసింహా, కార్యవర్గసభ్యులు రామంజనేయులు, రాంచద్రయ్య, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు రత్నకర్‌, ఏఐటీ యూసీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కాందాల రామకృష్ణ, రాష్ట్ర సమితి సభ్యుడు నక్కి లెనిన్‌బాబు, నాయకులు ఫయాజ్‌, ఇన్సాఫ్‌, సురవరం కపిల్‌, విజయలక్ష్మీ, నాగరాజు, పెద్దబాబు, రవి, కృష్ణ తదితరులున్నారు. 

Updated Date - 2022-05-20T05:14:35+05:30 IST