దార్శనికుడు ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి

ABN , First Publish Date - 2022-05-29T07:28:05+05:30 IST

రాష్ట్రంలో ఎక్కడ చూసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరితారక రామారావు చేసిన అభివృద్ది చిహ్నలే కన్పిస్తున్నాయని జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు.

దార్శనికుడు ఎన్‌టీఆర్‌కు ఘన నివాళి
ఎన్‌టీఆర్‌కు నివాళి అర్పిస్తున్న నాయకులు

ఎర్రగొండపాలెం, మే 28 : రాష్ట్రంలో ఎక్కడ చూసిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరితారక రామారావు చేసిన అభివృద్ది చిహ్నలే కన్పిస్తున్నాయని జడ్పీ మాజీ ఉపాధ్యక్షులు డాక్టరు మన్నె రవీంద్ర అన్నారు. ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని శనివారం ఎర్రగొండపాలెం ప్రధాన సెంటరులో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలాంకృతం చేసి నివాళులు తెలిపారు. డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ ఎన్టీఆర్‌ యుగపురుషుడు అని అలాంటి  మహానీయుడు మరల పుట్టబోడు అని అన్నారు. బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి ఎన్టీఆర్‌ అని పేదల హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్న మహానీయుడు ఎన్టీఆర్‌ అని అన్నారు.

  ఎన్టీఆర్‌ జయంతి కేక్‌ పంపిణీ 

 ఎన్టీఆర్‌ శత జయంతి కేక్‌నుకట్‌ చేసి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పంపిణి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం మండల టీడీపీ అధ్యక్షులు చేకూరి సుబ్బారావు, రాష్ట్ర ఎస్టీ కార్యదర్శి ఎంసిహెచ్‌ మంత్రునాయక్‌, నియోజకవర్గ రైతు అధ్యక్షులు చిట్యాల వెంగళరెడ్డి, టీడీపీ మండల మాజీ అధ్యక్షులు కామేపల్లి  వెంకటేశ్వర్లు, షేక్‌ జిలానీ, టీడీపీ బిసి సెల్‌ ఉపాధ్యక్షులు కంచర్ల సత్యనారాయణగౌడ్‌,  మండల టీడీపీ నాయకులు తోట మహేష్‌, కందుల నారాయణరెడ్డి, మండల తెలుగుయువత అధ్యక్షులు కొత్త భాస్కర్‌, మండలరైతుకార్యదర్శి పోతిరెడ్డి రమణారెడ్డి, మండల కార్యదర్శి జి కనకారావు,మైనార్టీ నాయకులు ఇస్మాయిల్‌, టౌన్‌ అధ్యక్షులు షేక్‌ మస్తాన్‌ వలి, మల్లెల వెంకటనారాయణ, మాగులూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మండలంలోని టీడీపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మార్కాపురం, మే 28: చిరస్మరణీయుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ నాయకులు అ న్నారు. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్స వాల ను శనివారం నాయుడుబజారులోని ఎన్టీఆ ర్‌ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేట్‌ కట్‌ చేసి పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా పొదిలి నుఇంచి  పొదిలి నుంచి భారీగా ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కందుల రామిరెడ్డి, టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి వక్కల గడ్డ మల్లికార్జున్‌; ఒంగోలు పార్లమెంట్‌ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి సత్యనారాయణం కౌన్సిలర్లు యేరువ నారాయణరెడ్డి, నాలి కొండయ్య, టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మౌలాలీ, కొప్పుల శ్రీనివాసులు, పాల్గొన్నారు.  జయంతి సందర్బంగా మిట్టపాలెం, టి.చెర్లోపల్లి, కె.అన్నసముద్రం గ్రామాలలో ఎన్టీఆర్‌ విగ్రహాలకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి నివాలులర్పించారు.


Updated Date - 2022-05-29T07:28:05+05:30 IST