కరీనాకు ఘన స్వాగతం పలుతుకున్న నాయకులు, సభ్యులు
కాగజ్‌నగర్, మార్చి 27: వారం రోజుల క్రితం కజకిస్తాన్‌లో నిర్వహించిన 9వ ఏషియన్ఉమెన్స్ హ్యాండ్‌బాల్ యూత్ చాంపియన్‌షిప్‌లో పాల్గొని సొంత జిల్లాకు వచ్చిన మడావి కరీనాకు కాగజ్‌నగర్‌లో వివిధ సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. కుమరం భీం జిల్లానుంచి దేశం తరుపున క్రీడల్లో పాల్గొనడం ఇదే తొలిసారికావడంతో అంతా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ తనకు అంతర్జాతీయ స్థాయిలో ఆడేం దుకు అవకాశం కల్పించి సహకరించిన ప్రతిఒక్కరికి రుణపడి ఉంటానని తెలి పారు. కరీనా ప్రస్తుతం ఆసిఫాబాద్‌లోని ఇంటర్మీడియట్ కళాశాలలో సీఈసీ మొదటి సంవత్సరంచదువుతోంది. జిల్లా గిరిజనసంక్షేమ శాఖ ఉపా ధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, పీడీ మధు, రిటైర్డ్ తహసీల్దార్ సుభాష్, బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్: మడావి కరీనాకు జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి ఘనస్వాగతం పలికారు. స్థానిక చెక్‌పోస్టు వద్ద మొదట జడ్పీ ఛైర్పర్సన్ కరీనాకు పూలమాలలు వేసి శాలువా కప్పి సత్కారించారు. అనం తరం ఓపెన్‌టాప్ జీపులో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చెక్‌పోస్టు నుంచి కుమరంభీం చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రిన్సిపాల్ రమ్య, శిక్షకుడు అరవింద్, పీడీలు మధుసూదన్, శంకర్, విద్యార్థులు పాల్గొన్నారు.