Viral News: మాజీ ప్రియురాలిపై కోపం.. ఆమె ఎదుటే హ్యాండ్ బ్యాగ్‌లో మూత్రం పోసిన యువకుడు.. చివరికి అతడి పరిస్థితి..

ABN , First Publish Date - 2022-08-19T13:01:11+05:30 IST

ప్రేమలో ఉన్నప్పుడు ప్రియురాలి నోటి నుంచి వచ్చే ప్రతి పదం తేనెలా తియ్యగా ఉంటుంది. ఆమె ఏం చేసినా అస్సలు కోపం రాదు. పైగా బుజ్జి, బంగారం అంటూ ప్రేయసి కోసం తపిస్తారు. కానీ అనుకోకుండా ఆ బంధంలో బీటలు వారితే.. అప్పటి వరకు మధురాతిమధురంగా అనిపించిన ఆమె మాటలు కాస్తా వేపాకులా చేదుగా మారిపోతాయి. ఈ క్రమంలోనే కొందరు యువకులు తమ మాజీ

Viral News: మాజీ ప్రియురాలిపై కోపం.. ఆమె ఎదుటే హ్యాండ్ బ్యాగ్‌లో మూత్రం పోసిన యువకుడు.. చివరికి అతడి పరిస్థితి..

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమ(Love)లో ఉన్నప్పుడు ప్రియురాలి నోటి నుంచి వచ్చే ప్రతి పదం తేనెలా తియ్యగా ఉంటుంది. ఆమె ఏం చేసినా అస్సలు కోపం రాదు. పైగా బుజ్జి, బంగారం అంటూ ప్రేయసి కోసం తపిస్తారు. కానీ అనుకోకుండా ఆ బంధంలో బీటలు వారితే.. అప్పటి వరకు మధురాతిమధురంగా అనిపించిన ఆమె మాటలు కాస్తా వేపాకులా చేదుగా మారిపోతాయి. ఈ క్రమంలోనే కొందరు యువకులు తమ మాజీ గాళ్‌ఫ్రెండ్స్‌పై సోషల్ మీడియా వేదికగా గానీ లేదా ప్రత్యక్షంగా దాడికి దిగుతుంటారు. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. ఈ కోవకే చెందిన ఓ యువకుడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. మాజీ ప్రియురాలిపై కోపంతో ఆమె హ్యాండ్ బ్యాగ్‌లో మూత్రం పోసి.. శునకానందం పొందాడు. కాగా.. ఇంతకు ఈ దారుణానికి పాల్పడింది ఎవరు? చివరికి అతడి పరిస్థితి ఏమైంది? అనే విషయాల తెలియాలంటే పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే..



దక్షిణ కొరియా(South Korea)లోని సియెల్ ప్రాంతానికి చెందిన 31ఏళ్ల యువకుడు.. ఓ యువతిని చూసి ఇష్టపడ్డాడు. తన మనసులోని మాటను ఆమె వద్ద వ్యక్తపరిచాడు. అమెకు కూడా అతడు నచ్చడంతో.. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇంతలో ఏమైందో ఏమో కానీ వారి మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఇంటికి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. ఆమె కూడా తగ్గలేదు. దీటుగా ఎదురుదాడి చేసింది. ఈ నేపథ్యంలో అతడు కోపంతో ఊగిపోయాడు. బ్రేకప్ చెప్పేశాడు. అతడు అంతటితో ఆగలేదు. నేరుగా ఆమె బెడ్‌రూమ్‌లోని వెళ్లిపోయాడు. రూమ్‌లో ఉన్న ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌(Hand Bag)ను తీసుకొచ్చి.. ఆమె ముందే దాంట్లో మూత్రం(Urinates In Ex-Girlfriends hand Bag) పోశాడు. అనంతరం దాన్ని కవర్ చేయడానికి అందులో పర్ఫ్యూమ్ కొట్టాడు. ఈ నేపథ్యంలో మాజీ ప్రియుడిపై ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు.. యువకుడిని విచారించారు. అయితే.. తప్పును అతడు అంగీకరించకపోవడంతో బ్యాగును ల్యాబ్‌కు పంపి టెస్ట్ చేయించారు. ఫలితాల్లో అతడు చేసిన దారుణం బయటపడింది. ఈ ఘటన గత ఏడాది అక్టోబర్‌లో చోటు చేసుకోగా.. దీనిపై విచారణ జరిపిన కోర్టు(Court) తాజాగా తీర్పు వెల్లడించింది. చేసిన తప్పుకు యువకుడికి 1,150 డాలర్లు (సుమారు రూ.91వేల) జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా(Viral News) మారింది. 

Updated Date - 2022-08-19T13:01:11+05:30 IST