‘మహా’ కాంగ్రెస్లో చీలిక?
ABN , First Publish Date - 2022-07-06T08:48:14+05:30 IST
మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారా? కాంగ్రె స్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సహా 11 ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు హాజరుకాకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది.
విశ్వాస పరీక్షకు 11 ఎమ్మెల్యేల గైర్హాజరుపై అనుమానాలు
ముంబై, జూలై 5: మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండుగా చీలిపోయారా? కాంగ్రె స్ నేత, మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సహా 11 ఎమ్మెల్యేలు సోమవారం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షకు హాజరుకాకపోవడం ఈ అనుమానానికి తావిస్తోంది. అయితే ఎమ్మెల్యేల గైర్హాజరీ అనేది ఉద్దేశపూర్వకం కానేకాదని అశోక్ చవాన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో కొందరు హాజరవ్వకపోవడంతో ‘మహా వికాస్ అఘాడీ’ నుంచి ఆ పార్టీ బయటకు వస్తుందా? అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. అయితే ఇవన్నీ నిరాధారం అని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ హెచ్కే పాటిల్ పేర్కొన్నారు.