నూజివీడు టౌన్, మే 13: నూజివీడు డీఆర్ కళాశాలలో ఇంటర్ పరీక్షా కేంద్రంలో పరీక్ష రాస్తూ అస్వస్థతకు గురైంది. పరీక్ష రాసే క్రమంలో నాగమణి అనే విద్యార్థిని గ్యాస్ బాధతో ఇబ్బంది పడుతూ పరీక్షా కేంద్రంలో స్తృహ కోల్పోయింది. గుర్తించిన ఇన్విజిలేటర్లు సమాచారాన్ని అక్కడే ఉన్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి తెలిపారు. ఆ సమయంలో పరీక్ష కేంద్రానికి వచ్చిన నూజివీడు పట్టణ ఎస్ఐ టి.రామకృష్ణ విద్యార్థినిని తన వాహనంలో నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సను చేయించారు.