తెలివి తక్కువ కోరిక!

ABN , First Publish Date - 2020-07-14T05:30:00+05:30 IST

ఒక గ్రామంలో ఓ చేనేత కార్మికుడు తన భార్యతో కలిసి జీవించేవాడు. ఒకరోజు తన మగ్గం మరమ్మతుకు అవసరమైన కలపను తీసుకురావడం కోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఒక చెట్టును చూసి నరకడం మొదలు పెట్టాడు....

తెలివి తక్కువ కోరిక!

ఒక గ్రామంలో ఓ చేనేత కార్మికుడు తన భార్యతో కలిసి జీవించేవాడు. ఒకరోజు తన మగ్గం మరమ్మతుకు అవసరమైన కలపను తీసుకురావడం కోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఒక చెట్టును చూసి నరకడం మొదలు పెట్టాడు. ఇంతలో ఆ చెట్టు తొర్రలో దాగి ఉన్న భూతం బయటకు వచ్చి ‘‘ఈ చెట్టును నరకొద్దు. కావాలంటే నీవు వేరే ఏదైనా కోరుకో! అది నీకు ఇస్తాను’’ అంది. ఆ వ్యక్తికి ఏం అడగాలో తోచలేదు. ఇంటికి చేరుకుని భార్యకు విషయం చెప్పాడు. తెలివిలేని ఆ ఇల్లాలు ‘‘అదనంగా మరో రెండు చేతులు, ఇంకో తల అడుగు. అప్పుడు ఎక్కువ ఆలోచించవచ్చు. ఎక్కువ పనిచేయవచ్చు’’ అని భర్తకు చెప్పింది. తిరిగి అడవికి బయలుదేరిన ఆ తెలివి తక్కువ భర్త భూతం దగ్గరకు చేరుకుని భార్య చెప్పినట్టుగా అడిగాడు. వెంటనే భూతం ఆ కోరికను నెరవేర్చింది. దాంతో సంతోషంగా అతడు ఇంటి దారి పట్టాడు. మధ్యలో గ్రామస్థులు అతని రెండు తలలు, నాలుగు చేతులు చూసి రాక్షసుడు అనుకుని కొట్టి చంపారు.

Updated Date - 2020-07-14T05:30:00+05:30 IST