కథకు తగ్గ టైటిల్‌

Published: Thu, 18 Aug 2022 07:11:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కథకు తగ్గ టైటిల్‌

ఆది సాయికుమార్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ జంటగా నటించిన చిత్రం ‘తీస్‌మార్‌ ఖాన్‌’. కల్యాణ్‌ జి. గోగణ దర్శకత్వంలో డా. నాగం తిరుపతిరెడ్డి నిర్మించారు. ఈ నెల 19న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న హీరో సుధీర్‌బాబు మాట్లాడుతూ ‘ఇది ఆదికి పెర్‌ఫెక్ట్‌ సినిమా, కథకు తగ్గ టైటిల్‌’ అన్నారు. ‘తీస్‌మార్‌ఖాన్‌’ సినిమా థియేటర్లలో కుమ్మేయాలి అని అడివి శేష్‌ కోరుకున్నారు. పూర్తిస్థాయి కమర్షియల్‌  సినిమా ఇది, సాయి కార్తీక్‌ మంచి బీజీఎం ఇచ్చారు అని ఆది సాయికుమార్‌ చెప్పారు. సింగిల్‌ టేక్‌లో సినిమాను ఓకే చేశాను అని చిత్ర నిర్మాత తెలిపారు. సునీల్‌, పూర్ణ, కబీర్‌సింగ్‌ అద్భుతంగా నటించారు అని కల్యాణ్‌ ప్రశంసించారు. మూడేళ్ల తర్వాత నా సినిమా థియేటర్లలో వస్తోంది అని పాయల్‌ రాజ్‌పుత్‌ అన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International