Viral Video: కళ్లముందే కొట్టుకుపోయిన స్కార్పియో వాహనం.. ఆ వాహనంలోని వారి కోసం అన్వేషణ..

ABN , First Publish Date - 2022-09-25T02:26:11+05:30 IST

భారీ వర్షాలు, వరదలతో అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh) వణికిపోతోంది.

Viral Video: కళ్లముందే కొట్టుకుపోయిన స్కార్పియో వాహనం.. ఆ వాహనంలోని వారి కోసం అన్వేషణ..

భారీ వర్షాలు, వరదలతో అరుణాచల్ ప్రదేశ్‌ (Arunachal Pradesh) వణికిపోతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితి భయంకరంగా మారింది. పొంగి పొరలుతున్న వాగుల వల్ల వరదలు (Flash Floods) అలజడి సృష్టిస్తున్నాయి. అక్కడ వరద బీభత్సం ఏ స్థాయిలో ఉందో చూపించే ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ (Viral Video) అవుతోంది. 


అరుణాచల్ ప్రదేశ్‌లోని చిపుటా గ్రామంలోని పరిస్థితిని ఆ వీడియో కళ్లకు కడుతోంది. భారీ వరదలో ఓ స్కార్పియో వాహనం చిక్కుకుంది. అంతకంతకు పెరుగుతున్న నీటి ప్రవాహం కారణంగా ఆ వాహనం ముందుకు కదలకుండా ఆగిపోయింది. దాని పక్కనే ఓ గట్టుపై ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు సాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. కొంత సేపటికి వారి వాహనం నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి లోయలో పడిపోయింది. ఆ దృశ్యాలను దూరంగా మరో కారులో ఉన్న వ్యక్తులు రికార్డ్‌ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఆ వాహనంలోని వారు ఏమయ్యారు అనే విషయం తెలియడం లేదు. వారి జాడ కోసం సహాయక సిబ్బంది అన్వేషిస్తున్నట్టు సమాచారం. 

Updated Date - 2022-09-25T02:26:11+05:30 IST