యానంపల్లి తండాను సందర్శించిన పశువైద్య జీవ పరిశోధన సంస్థ బృందం

ABN , First Publish Date - 2021-01-16T05:09:46+05:30 IST

మండలంలోని యానంపల్లి తండాలో నాలు గు రోజుల క్రితం ఓ పౌల్ర్టీఫాంలో రెండు వేల కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి గురువారం పశువైద్య జీవపరిశోధన సంస్థ హైదరాబాద్‌ బృందం సందర్శించి వివరాలు అడిగి తెలసుకున్నారు.

యానంపల్లి తండాను సందర్శించిన పశువైద్య జీవ పరిశోధన సంస్థ బృందం
శాంపిళ్లు సేకరిస్తున్న హైదరాబాద్‌ సభ్యుల బృందం

డిచ్‌పల్లి, జనవరి 15:  మండలంలోని యానంపల్లి తండాలో నాలు గు రోజుల క్రితం ఓ పౌల్ర్టీఫాంలో రెండు వేల కోళ్లు మృతి చెందడంతో యానంపల్లి గురువారం పశువైద్య జీవపరిశోధన సంస్థ హైదరాబాద్‌ బృందం సందర్శించి వివరాలు అడిగి తెలసుకున్నారు. కోళ్ల తాలూకు నమూనాలను సేకరించారని జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ భరత్‌, విలేకర్లతో తెలిపారు. హైదరాబాద్‌ పశువైద్య జీవ పరిశోధన సంస్థ బృందంలో డాక్టర్‌ విజయ్‌ భాస్కర్‌ రెడ్డి, శిరీష, కోటీనాగు, సందర్శించి తగు జాగ్రత్తలు సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు బర్డ్‌ ప్లూ వ్యాధి నిర్ధారణ కాలేదని ఒకవేళ ఆకస్మికంగా కోళ్లు మృత్యువాత పడితే సం బంధిత పశువైద్యాధికారికి సమాచారం ఇవ్వలన్నారు. పౌల్ర్టీ ఫాంలోకి బయటి వ్యక్తులు అనవసరంగా లోనికి పంపవద్దని జిల్లాలో ఇప్పటికే 22ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ టీంలను శిక్షణ ఇచ్చి సిద్ధంగా ఉంచామన్నారు. సేకరించిన కోళ్ల నమూనాలను వెటర్నరీ బయోలాజికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ హైదరాబాద్‌ నుంచి రాగనే తెలియజేసామతని డాక్టర్‌ భరత్‌ తెలిపారు. ఆయన వెంట పశువైద్యసిబ్బంది డాక్టర్‌ బాలిక్‌ హైమద్‌, దేశ్‌ పాండే, గోపికృష్ణ ఉన్నారు. 

పడి పోయిన చికెన్‌ విక్రయాలు 

యానంపల్లి తండాలో వింత వ్యాధితో రెండు వేల కోళ్లు మృతి చెం దడంతో డిచ్‌పల్లి మండలంలో కోళ్ల మాంసం విక్రయాలు పూర్తిగా తగ్గిపోయాయి. వ్యాపారులు విక్రయాలు లేకా వెల వెల బోతున్నాయి, కోడి గుడ్ల విక్రయాలు మందగించాయి.

Updated Date - 2021-01-16T05:09:46+05:30 IST