Advertisement

పంటలను పరిశీలించిన రాష్ట్ర అధికారుల బృందం

Jan 21 2021 @ 23:46PM
పంట క్షేత్రాన్ని పరిశీలిస్తున్న అధికారుల బృందం

ఆదిలాబాద్‌రూరల్‌, జనవరి 21: మండలంలోని పొచ్చెర, గిమ్మా గ్రామాల్లో నూతన విత్తనమైన శనగ పంటను గురువారం వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు పరిశీలించారు. ఈ గ్రామంలోని రైతులు ఎన్‌బీఈజీ 74 రకం శనగ పంటను సాగు చేస్తున్నారు. జాతీయ ఆహార భద్రత పథకం కింద వేసిన ఈ పంటను అధికారుల బృందం పరిశీలించి వివరాలు సేకరించారు. కొత్త రకం శనగ పంట ఏపుగా పెరగడంతో అధికారులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే జిల్లాలో అమలు చేయు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఐలోని అంశాలను పంపుసెట్లు, వ్యవసాయ పనిముట్ల రాయితీని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ పంటను పరిశీలించిన బృందంలో డీఈఏ మాధవి, ఏడీఏ శైలజ, పద్మజ, ఏఓ శైలజ, నర్సింహులు, ఏడీఏ రమేష్‌, డీఏఓ ఆశాకుమారి, ఏఓ టెక్నికల్‌ శివకుమార్‌, మండల వ్యవసాయాధికారి ఎండీ అశ్రఫ్‌ అహ్మద్‌, పొచ్చెర ఏఈ ప్రసాద్‌, సర్పంచ్‌ మమత, రైతులు పాల్గొన్నారు.

బోథ్‌: మండలంలోని సోనాలలో సాగుచేస్తున్న హైబ్రీడ్‌ జొన్న పంటను, మేడి గ్రామంలో ఆవాల పంటలను గురువారం జాతీయ ఆహార  భద్రత మిషన్‌ పర్యవేక్షణ అధికారి మాధవి, డీడీఏ పద్మజ, ఏడీఏ శైలజ  పరిశీలించారు. ఈ సందర్భంగా వారు రైతులకు పలు సూచనలను,  సలహాలను ఇవ్వడంతో పాటు పలు క్రిమిసంహారక మందులను ఉచితంగా అందించారు. వారి వెంట ఏవో వెండి విశ్వామిత్ర, ఏఈవోలు శ్యాంసుందర్‌ రెడ్డి, వాజిద్‌. సంతోష్‌, సోనాల సర్పంచ్‌ సదానందం రైతులు ఉన్నారు.

Follow Us on:
Advertisement