Instagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..

Published: Sun, 07 Aug 2022 18:34:51 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Instagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా ఉండడంతో.. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వీడియోలు, ఫొటోలు తీసి.. వివిధ వేదికల ద్వారా షేర్ చేస్తున్నారు. కొందరైతే ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యూస్, లైకుల కోసం వివిధ విన్యాసాలు చేసే వారిని చాలా మందిని చూశాం. అలాగే అదే వ్యూస్, లైకులు రాలేదని.. చివరకు ఆత్మహత్యలు చేసుకున్నవారిని కూడా చూశాం. ఇటీవల చాలా మంది లైకులు, వ్యూస్ పెరిగేందుకు (increase Likes and views) సలహాలు ఇస్తున్న విషయం తెలిసిందే. కేరళలో ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రాంలో (Instagram videos) ఎలా ఫేమస్ అవ్వాలనే అంశంపై సలహాలు ఇస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అతడికి చాలా మంది యువతులు (young women) పరిచయమయ్యారు. ఇటీవల కారు కొంటున్నా అని ఓ యువతిని పిలిచి, అతడు చేసిన నిర్వాకం.. తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

కేరళ (Kerala) రాష్ట్రం తిరువనంతపురం (Thiruvananthapuram) తంపనూరు పరిధి వెల్లల్లూరు సమీపానికి చెందిన వినీత్.. ఇన్‌స్టాగ్రాంలో వీడియోలు చేస్తుంటాడు. ఇతడికి సుమారు లక్ష మందికి పైగా ఫాలోవర్స్ (Millions of followers) ఉన్నారు. తనను తాను పోలీస్ ఆఫీసర్‌గా (Police officer) పరిచయం చేసుకున్న వినీత్.. ఉద్యోగం నచ్చక మానేశానని అందరికీ చెప్పేవాడు. ప్రస్తుతం ఓ ప్రైవేట్ చానెల్లో పని చేస్తున్నా అని చెప్పుకొంటూ వీడియోలు చేసేవాడు. ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అయ్యేందుకు సలహాలు ఇస్తుండడంతో అతడికి చాలా మంది యువతులు పరిచయమయ్యారు. దీంతో వారితో రోజూ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. అలాగే ఫోన్లలో కూడా మాట్లాడుతూ, ప్రైవేట్ ఫొటోలను (Private photos) కూడా షేర్ చేసుకునేవాడు. ఈ క్రమంలో అన్నింటినీ రికార్డు (Calls and video records) చేసుకునేవాడు.

Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం..

ఇలావుండగా, ఇటీవల పక్క జిల్లాకు చెందిన ఓ యువతికి ఫోన్ చేసి, కారు కొనేందుకు ఇద్దరం కలిసి వెళ్దామని చెప్పాడు. కారు కొన్న అనంతరం తిరుగుప్రయాణంలో యువతిని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే కాల్ రికార్డులు, ఫొటోలు, వీడియోలను బయటపెడతానంటూ బెదిరించాడు. అయితే తర్వాత కొన్ని రోజులకు ఆమె అనారోగ్యానికి గురైంది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో స్నేహితులు ఆమెను విచారించారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించింది. చివరకు అంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది.

Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

Anand Mahindra Tweet: చూసేందుకు పిచ్చుక గూడే.. అందులోని టెక్నాలజీ చూస్తే మతి పోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. videoFunny video: అందుకే దీన్ని గుడ్లగూబ అనేది.. రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను పసిగట్టి.. ఏం చేసిందంటే.. videoబావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..Government schools: పాఠశాలలోని పరిస్థితిని కళ్లకు కట్టిన విద్యార్థి.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. videogirlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం.. inhuman incident: మామ పిలవడంతో ఇంటికి వెళ్లింది.. పక్కన కూర్చోబెట్టుకుని చివరకు ఇలాంటి పని చేస్తాడని ఎవరూ ఊహించలేదు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.