AP News: మేకల మందపై విరుచుకుపడ్డ పెద్దపులి

ABN , First Publish Date - 2022-09-23T13:56:28+05:30 IST

జిల్లాలోని మెరకముడిదాం మండలం శాతాంవలసలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు.

AP News: మేకల మందపై విరుచుకుపడ్డ పెద్దపులి

విజయనగరం: జిల్లాలోని మెరకముడిదాం మండలం శాతాంవలసలో పెద్దపులి సంచారంతో గ్రామస్తులు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. గత రాత్రి మేకల మందపై పెద్దపులి విరుచుకుపడింది. పెద్దపులి దాడిలో 3 మేకలు మృతి చెందగా... మరో 5 మేకలకు తీవ్రగాయాలయ్యాయి. పెద్దపులిని చూసిన మేకల కాపరులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మేకల కాపరుల అరుపులతో పెద్దపులి సమీపంలోని కొండల్లోకి వెళ్లింది. పెద్దపులి నుంచి తమను, తమ పశువులను రక్షించాలంటూ అటవీ శాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు. 

Updated Date - 2022-09-23T13:56:28+05:30 IST