Advertisement

ఉమ్మడి జిల్లా : 656

Sep 16 2020 @ 01:50AM

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, సెప్టెంబరు 15: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం 656 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో 380, సూర్యాపేటలో 116, యాదాద్రి జిల్లాలో 160 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో ఒకరు కరోనాతో మృతిచెందారు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో సోమవారం 644 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర బులెటిన్‌లో మాత్రం 211 కేసులు చూపించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం నిర్వహించిన రాపిడ్‌ పరీక్షల్లో మిర్యాలగూడ 39, భువనగిరి 38, చౌటుప్పల్‌ 28, నకిరేకల్‌ 25, సూర్యాపేట 23, దేవరకొండ, వలిగొండ, శాలిగౌరారం 20 చొప్పున, కోదాడ 16, నార్కట్‌పల్లి, ఆలేరు, ఆత్మకూరు(ఎస్‌), తిప్పర్తి 15 చొప్పున, బీబీనగర్‌ 13, త్రిపురా రం, హుజూర్‌నగర్‌, చండూరు, మేళ్లచెర్వు 12 చొప్పున, సం స్థాన్‌నారాయణపురం 11, తుంగతుర్తి, మునగాల 10 చొప్పున పాజిటి వ్‌ కేసులు నమోదయ్యాయి.


కొండమల్లేపల్లి,నేరేడుచర్ల,గరిడేపల్లి తొమ్మి ది చొప్పున, చింతపల్లి, నడిగూడెం, చిట్యాల, మోత్కూరు ఎనిమిది చొప్పున, డిండి, గుర్రంపోడు,హాలియా, మాడ్గులపల్లి, చివ్వెంల, సాగర్‌, రామన్నపేట ఏడు చొప్పున, దామచర్ల ఆరు, కనగల్‌, తిరుమలగిరి, నాగారం, మద్దిరాల, అడ్డగూడూరు, రాజాపేట ఐదు చొప్పున, మర్రిగూడ, అర్వపల్లి, మునుగోడు, మోతె, పీఏపల్లి, పెన్‌పహాడ్‌ నాలుగు చొప్పున, నాంపల్లి, అడవిదేవులపల్లి, పాలకవీడు,నిడమనూరు, బొమ్మలరామారం మూడు చొప్పున, తిరుమలగిరి(సాగర్‌),  ఆత్మకూరు (ఎం), అనంతగిరి, నూ తనకల్‌, యాదగిరిగుట్ట, చిలుకూరు రెండు చొప్పున, చందంపేట, కేతేపల్లి, మఠంపల్లి, గుండాల, భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి ఒకటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.


బీబీనగర్‌ ఎయిమ్స్‌లో రాపిడ్‌యాంటిజెన్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. పరీక్షలకు వచ్చేవారు ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాల ని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వికా్‌సబాటియా తెలిపారు. వివరాలకు హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 08685-295050లో సంప్రదించాలని చెప్పారు. భువనగిరి మండలంలోని అనాజిపురం, ఆలేరు మునిసిపాలిటీ 5వ వార్డులో మొబైల్‌ రాపిడ్‌ పరీక్షలు నిర్వహిం చారు.

Follow Us on:
Advertisement
Advertisement