Bengalore : అమ్మకానికి కారు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లు!

ABN , First Publish Date - 2022-05-28T23:25:44+05:30 IST

ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడమంటే నరకంలో పడినట్లే. ఆ

Bengalore : అమ్మకానికి కారు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లు!

బెంగళూరు : ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోవడమంటే నరకంలో పడినట్లే. ఆ బాధను అనుభవించినవారే అర్థం చేసుకోగలరు. బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి చాలా మంది సామాజిక మాధ్యమాల్లో వివరిస్తూ ఉంటారు. ఈ కష్టాలు తెలిసిన ఓ బెంగళూరువాసి అద్భుతమైన హాస్యాన్ని జోడించి ఓ ట్వీట్ చేశారు. అది విస్తృతంగా ప్రచారమవుతోంది. 


బెంగళూరువాసి శ్రీకాంత్ మే 25న ఇచ్చిన ట్వీట్‌లో, తన మిత్రుని కారు గేర్లను అమ్మకానికి పెడుతున్నట్లు చెప్తూ, వాటిని ఎవరైనా కొంటారా? అని అడిగారు. 


‘‘బెంగళూరులోని నా మిత్రుడు తన కారుకుగల థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ గేర్లను అమ్మాలనుకుంటున్నారు. అవి నిరుపయోగంగా ఉన్నాయి. అవి షోరూం కండిషన్‌లో ఉన్నాయి’’ అని తెలిపారు. వీటిని కొనడానికి బెంగళూరులో ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. 


ఈ ట్వీట్‌కు 8,500కు పైగా లైక్‌లు వచ్చాయి. కామెంట్ల వరద పారింది. ఓ యూజర్ స్పందిస్తూ, ఆయన ఉదయం 12 గంటల నుంచి ఉదయం 4 గంటల మధ్యలో ఎందుకు డ్రైవ్ చేయకూడదు? అని అడిగారు. 


మరో యూజర్ స్పందిస్తూ, లక్షలాది రూపాయలు పన్నులు చెల్లిస్తూ కూడా వాస్తవ సమస్యలను లేవనెత్తలేకపోతున్నామన్నారు. గొప్ప పౌరునిగా ఉండటం కోసం నోరు మూసుకుని, మౌనంగా ఇబ్బందులు అనుభవించవలసి వస్తోందని తెలుసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 


మరో యూజర్ స్పందిస్తూ, చంద్రునిపై స్థలాన్ని అమ్మడానికి ప్రయత్నించే బదులు, కొందరు కొనుగోలుదారులు కచ్చితంగా వస్తారన్నారు. 


బెంగళూరు వాతావరణం ఇతర నగరాల్లో కన్నా బాగుంటుందని అందరికీ తెలిసిందే. 

 



Updated Date - 2022-05-28T23:25:44+05:30 IST