యాదగిరిగుట్ట: తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం కూలి నలుగురు దుర్మరణం చెందారు. మృతులు దశరథ, శ్రీను, ఉపేందర్, శ్రీనివాస్‌గా గుర్తించారు. గిరి అనే వ్యక్తి పరిస్థితి విషమం ఉండడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.