Viral News: మహిళకు చేదు అనుభవం.. KFC చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2021-10-24T00:22:26+05:30 IST

కేఎఫ్‌సీ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. సరదాగా కేఎఫ్‌సీకి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. ఇంతగా ఫేమస్ అయిన కేఎఫ్‌సీ పని చేసేందుకు ఓ మహిళ దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు జాబ్ ఇచ్చేందుకు కేఎఫ్‌సీ నిరాకరించింది. అంతేకాకుండా జాబ్ ఇవ్వకపోవడానికి కారణాన్ని కూడా కేఎఫ్‌

Viral News: మహిళకు చేదు అనుభవం.. KFC చేసిన పనికి మండిపడుతున్న నెటిజన్లు

ఇంటర్నెట్ డెస్క్: కేఎఫ్‌సీ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయింది. వీకెండ్ వచ్చిందంటే చాలు.. సరదాగా కేఎఫ్‌సీకి వెళ్లడానికి చాలా మంది ఇష్టపడుతుంటారన్న విషయం తెలిసిందే. ఇంతగా ఫేమస్ అయిన కేఎఫ్‌సీ పని చేసేందుకు ఓ మహిళ దరఖాస్తు చేసుకోగా.. ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఆమెకు జాబ్ ఇచ్చేందుకు కేఎఫ్‌సీ నిరాకరించింది. అంతేకాకుండా జాబ్ ఇవ్వకపోవడానికి కారణాన్ని కూడా కేఎఫ్‌సీ వెల్లడించింది. కేఎఫ్‌సీ ఇచ్చిన వివరణ పట్ల ఆగ్రహానికి గురైన సదరు మహిళ.. తాను ఎదుర్కొన్న అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అదికాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తూ.. కేఎఫ్‌సీ‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



ఇంగ్లాండ్‌కు చెందిన సోఫీ అనే మహిళ కొద్ది రోజుల క్రితం డర్హామ్‌లోని కేఎఫ్‌సీలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో స్పందించిన కేఎఫ్‌సీ ప్రతినిధులు.. ఆమెకు జాబ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అంతేకాకుండా గతంలో పని చేసిన అనుభవం లేనందువల్లే జాబ్ ఇవ్వలేకపోతున్నట్లు వెల్లడించారు. కేఎఫ్‌సీ ప్రతినిధులు ఇచ్చిన ఈ వివరణతో సోఫీ ఆగ్రహానికి లోనయ్యారు. తనకు ఎదరైన చేదు అనుభవాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘గతంలో కేఎఫ్‌సీలోనే సుమారు రెండున్నర సంవత్సరాలు పని చేశాను. అయినప్పటికీ అనుభవం లేదన్న కారణంతో డర్హామ్‌లోని కేఎఫ్‌సీ ప్రతినిధులు నన్ను రిజెక్ట్ చేశారు’ అంటూ సోఫీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పోస్ట్ కాస్తా వైరల్ కావడంతో.. నెటిజన్లు స్పందిస్తున్నారు. కేఎఫ్‌సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 




Updated Date - 2021-10-24T00:22:26+05:30 IST