Tea Bag: ఈ టీ బ్యాగ్ ధర ఏకంగా 9.5 లక్షల రూపాయలు.. 24 ఏళ్ల క్రితం నాటిదే అయినా ఎందుకు ఇంత ఖరీదంటే..

ABN , First Publish Date - 2022-09-19T20:56:29+05:30 IST

టీ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.10 నుంచి 15 వరకు ఉంటుంది.

Tea Bag: ఈ టీ బ్యాగ్ ధర ఏకంగా 9.5 లక్షల రూపాయలు.. 24 ఏళ్ల క్రితం నాటిదే అయినా ఎందుకు ఇంత ఖరీదంటే..

టీ బ్యాగ్ ఖరీదు ఎంత ఉంటుంది? మహా అయితే రూ.10 నుంచి 15 వరకు ఉంటుంది. వాడి పారేసిన దానికి అసలు విలువే ఉండదు. అయితే 24 ఏళ్ల క్రితం వాడి వదిలేసిన ఓ టీ బ్యాగ్ ఇటీవల ఓ వేలంలో ఏకంగా రూ. 9.5 లక్షలకు అమ్ముడుపోయింది. ఎందుకంటే.. ఆ టీ బ్యాగ్‌ను వాడిన వారు సాధారణ వ్యక్తి కాదు.. బ్రిటన్‌ను  70 ఏళ్ల పాటు పరిపాలించిన మహారాణి ఎలిజబెత్-2. క్వీన్ ఎలిజబెత్-2 1998లో ఉపయోగించిన టీ బ్యాగ్ (used tea bag of Queen Elizabeth) తాజాగా నిర్వహించిన వేలంలో ఏకంగా 12 వేల డాలర్లకు సేల్ అయింది. అంటే మన కరెన్సీలో అక్షరాల 9.5 లక్షల రూపాయలు. 


ఇది కూడా చదవండి..

Viral Video: మామిడి చెట్టుపై చిరుత.. ఎటూ కదలకపోవడంతో అనుమానం వచ్చి చూస్తే..


అమెరికాలోని జార్జియాలో నివసిస్తున్న ఓ వ్యక్తి ఈ టీ బ్యాగ్‌ను విండ్సర్ పేలస్ నుంచి చేజిక్కించుకుని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో వేలానికి పెట్టాడు. ఈ టీ బ్యాగ్‌కు రాయల్ ఫ్యామిలీ సర్టిఫికెట్ కూడా ఉంది.  ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ సర్టిఫికెట్స్ (Institute of Excellence in Certificate of Authentication) ఇచ్చిన సర్టిఫికెట్‌ని దీనికి జోడించారు. ఈ టీ బ్యాగ్ మాత్రమే కాకుండా క్వీన్ ఎలిజబెత్-2కు సంబంధించిన పలు వస్తువులు కూడా ఈబే‌లో వేలానికి వస్తున్నాయి. ఎలిజబెత్- 2 మైనపు విగ్రహాన్ని కూడా ఈబేలో అమ్మకానికి పెట్టారు. దాని విలువ 15,900 డాలర్లుగా (రూ.12.6 లక్షలు) పేర్కొన్నారు. ఇంకా క్వీన్ బార్బీ బొమ్మ వంటివి కూడా ఈ-కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉన్నాయి. కాగా, క్వీన్ ఎలిజబెత్-2 ఈ నెల 8వ తేదీన మరణించిన సంగతి తెలిసిందే. 

Updated Date - 2022-09-19T20:56:29+05:30 IST