Viral Video: నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..

Published: Sat, 02 Jul 2022 20:10:14 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: నిబంధనలు ఉల్లంఘించి.. డేంజరస్ స్టంట్ చేసిన బైకర్.. కాస్త పట్టు తప్పుంటే పెద్ద ప్రమాదమే జరిగుండేది..

చాలా మంది యువకులు కొన్నిసార్లు హద్దులు మీరి ప్రవర్తిస్తుంటారు. అటు ఇంట్లో వారిని, ఇటు బయటి వారినీ లెక్కచేయకుండా ఇష్టమొచ్చిన పనులన్నీ చేస్తుంటారు. దీనికితోడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ అవడంతో కొందరి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. హర్యానాలో ఓ యువకుడు ఇలాగే బైక్‌పై డేంజరస్ స్టంట్ చేశాడు. నిబంధనలు ఉల్లంఘించి అతడు చేసిన ఈ నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఆదేశించారు.

హర్యానాలోని పానిపట్ నగరం గుండా వెళ్లే ఢిల్లీ పారలల్ కెనాల్‌లో ఓ బైకర్.. డేంజరస్ స్టంట్ చేశాడు. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ యువకుడు.. బైకును అతివేగంగా నడుపుతూ వచ్చి.. ఒక్కసారిగా కాలువలోకి దూకేస్తాడు. పక్కనే ఉన్న అతడి మిత్రులు దీన్నంతా వీడియో తీస్తుంటారు. కాలువలోకి దూకే సమయంలో ఏమాత్రం పట్టుతప్పినా పెద్ద ప్రమాదమే జరిగుండేది. నీళ్లలోకి దూకిన తర్వాత బైకును వదిలేసి, ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుంటాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల కాలువలు, నదుల్లో స్నానం చేసే క్రమంలో ప్రమాదాలు జరుగుతుండడంతో యమునా నది, కాలువలు తదితరాల్లో బట్టలు ఉతకడం, స్నానం చేయడాన్ని అధికారులు నిషేధించారు. అయినా చాలా మంది యువకులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో పోలీసుల వరకు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు.

మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..


ఇవి కూడా చదవండిLatest News in Telugu

మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి.. పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..Viral Video: అంత పెద్ద ప్రమాదం జరిగినా.. రోడ్డుపై ఆసనాలు వేస్తున్న యువకుడు.. వీడికేమైనా పిచ్చా.. అంటున్న నెటిజన్లు.. videoదుస్తులు కొని Google Pay ద్వారా డబ్బులు చెల్లించిన బాలిక.. మరుసటి రోజే ‘‘ఐ లవ్ యూ’’ అంటూ యువకుడి మెసేజ్.. చివరకు.. రండి మేడమ్! మేము లిఫ్ట్ ఇస్తాం.. అంటూ తల్లీకూతుళ్లను కారు ఎక్కించుకున్నారు.. కాస్త ముందుకు వెళ్లగానే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.