Viral Video: ఈ పిల్లి, క్యాట్ వ్యాక్ చూడండి.. ఎంత పర్‌ఫెక్ట్‌గా చేసిందో.. చూస్తే అవాక్కవుతారు

ABN , First Publish Date - 2022-03-02T02:43:42+05:30 IST

క్యాట్ వ్యాక్.. అంటే అందమైన మగువలు స్టేజిపై స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే సీన్లే కళ్లముందు కదలాడతాయి. అయితే క్యాట్ వాక్‌ను క్యాటే చేస్తే ఎలా వుంటుంది. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా...

Viral Video: ఈ పిల్లి, క్యాట్ వ్యాక్ చూడండి.. ఎంత పర్‌ఫెక్ట్‌గా చేసిందో.. చూస్తే అవాక్కవుతారు

విభిన్నంగా ఉండే జంతువుల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే.  క్యాట్ వ్యాక్.. అంటే అందమైన మగువలు స్టేజిపై స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే సీన్లే కళ్లముందు కదలాడతాయి. అయితే క్యాట్ వాక్‌ను క్యాటే చేస్తే ఎలా వుంటుంది. ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే అనుకుంటున్నారా. ఈ వీడియో చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఇనుప గ్రిల్‌పై ఓ పిల్లి ఎంతో ఫర్‌ఫెక్ట్‌గా, ఎంతో ఆత్మ విశ్వాసంతో నడవడం.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.


ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ఇంటి బయట ఉన్న ఇనుప గ్రిల్ మీదకు ఓ పిల్లి వస్తుంది. ఇందులో ఏ విశేషమూ లేదు గానీ.. దానిపై అది నడిచిన తీరే ఈ వీడియో వైరల్ అవడానికి కారణమైంది. ఏదో నడుచుకుంటూ వెళ్లామన్నట్లు కాకుండా ఈ పిల్లి.. ఎంతో కాన్ఫిడెన్స్‌తో మరెంతో ఆత్మవిశ్వాసంతో నడవడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. మధ్యలో కొద్దిసేపు ఆగి.. ‘‘నా స్టైలే వేరు అన్నట్లుగా’’ ఓ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. మళ్లీ తన నడకను కొనసాగిస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ పిల్లి చాలా స్పెషల్ అంటూ చమత్కరిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి.

నాలుగేళ్లుగా హోటల్లో ఒకే గదిని బుక్ చేసుకున్న యువకుడు.. లోపలికి వెళ్లిన సిబ్బందికి ఊహించని షాక్.. చివరకు ఏమైందంటే..





Updated Date - 2022-03-02T02:43:42+05:30 IST