మెట్లు ఎక్కితే పడిపోతావ్, వద్దు అంటాడు తాత, నేనెక్కడికి వెళ్తున్నాను... అంటూనే 5 మెట్లు ఎక్కేసిందా సిసింద్రీ.

ABN , First Publish Date - 2022-02-20T21:55:23+05:30 IST

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది కాబట్టి.. ప్రతి ఒక్కరూ రోజు వారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరుచుకుంటున్నారు. అలా రూపొందిన ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది..

మెట్లు ఎక్కితే పడిపోతావ్, వద్దు అంటాడు తాత, నేనెక్కడికి వెళ్తున్నాను... అంటూనే 5 మెట్లు ఎక్కేసిందా సిసింద్రీ.

‘‘బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు.. చిటిపొటి పలుకుల ముద్దుమాటలే మా ధనధాన్యాలు’’.. అని ఓ సినీ కవి అన్నట్లు తెలిసీ తెలీని వయసులో చిన్నారుల వచ్చీరాని మాటలు, నవ్వులు, తప్పటడుగులు చూడటానికి రెండు కళ్లూ చాలవు. కొన్నిసార్లు పిల్లలు మాట్లాడుతుంటే.. అర్థం కాకున్నా అలానే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తోంది కాబట్టి.. ప్రతి ఒక్కరూ రోజు వారీ కార్యకలాపాలను ఫొటోలు, వీడియోల రూపంలో భద్రపరుచుకుంటున్నారు.  అలా రూపొందిన ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ‘‘మెట్లు ఎక్కితే పడిపోతావ్..’’ అంటూ తాత హెచ్చరిస్తూ ఉంటాడు. ‘‘నేనెక్కడికి వెళ్తున్నానూ...’’ అంటూనే 5మెట్లను ఎంతో చాకచక్యంగా ఎక్కేస్తుంది అందాల పాప.


ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ సిసింద్రి మెట్లు ఎక్కాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న చిన్నారి తాత, మరికొందరు ‘‘అలా చేయొద్దు.. మెట్లు ఎక్కితే కిందపడతావ్’’ అంటూ హెచ్చరిస్తుంటారు. అందుకు బదులుగా ఆ చిన్నారి.. వచ్చీరాని మాటలతో ఇచ్చే సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. ‘‘నేనెక్కడికి వెళ్తున్నాను’’.. అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఒక్కో మెట్టును ఎంతో జాగ్రత్తగా ఎక్కుతుంది. మధ్యలో ఓ మెట్టుపై కూర్చుని ‘‘నాకేం కాదులే.. మీరు భయపడొద్దు’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. అలా అంటూనే 5మెట్లు ఎక్కేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ఓ లుక్కేయండి మరి..

వరుడిని కంటి చూపుతో కంట్రోల్ చేసిన వధువు.. పెళ్లిమండంపంలో కూడా తగ్గనేలేదు కదా..





Updated Date - 2022-02-20T21:55:23+05:30 IST