Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..

Published: Sun, 07 Aug 2022 19:35:26 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..

కుక్కల పట్ల కొందరు అమితమైన ప్రేమ పెంచుకుంటారు. వాటి సంరక్షణ కోసం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడరు. ఇక వాటికి ఆపద వచ్చిందంటే తట్టుకోలేరు. కొందరైతే కుక్కల ప్రాణాలు కాపాడేందుకు తమ ప్రాణాలను కూడా ఫణంగా పెడుతుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే ఇందుకు నిదర్శనం. కొందరు పిల్లలు తమ పెంపుడు కుక్కను కాపాడేందుకు.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కొండచిలువతో పోరాటం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. పార్కులోకి వచ్చిన కొండచిలువ.. కుక్కను పట్టుకుంటుంది. దాని నడుము చుట్టూ పెనవేసుకుని ఊపిరాడకుండా చేస్తుంది. కొండచిలువ నుంచి విడిపించుకునేందుకు.. కుక్క శతవిధాలా ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యం కాకపోవడంతో మొరుగుతూ తన బాధను వ్యక్తం చేస్తుంది. అక్కడే ఉన్న కొందరు పిల్లలు గమనిస్తారు. వెంటనే అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుక్కను విడిపించే ప్రయత్నం చేస్తారు. మొదట సాధ్యం కాకపోయినా.. తర్వాత చాలా నేర్పుగా కొండచిలువ తలను గట్టిగా పట్టుకుంటారు. మరికొందరు బాలులు కొండచిలువ తోకను పట్టుకుని పక్కకు లాగుతారు. ఎట్టకేలకు కుక్క క్షేమంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకుంటారు. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Instagram videos: ఇన్‌స్టాగ్రాంలో ఫేమస్ అవ్వడంపై సలహాలు ఇస్తూ.. ఓ రోజు కారు కొంటున్నా అని యువతిని తీసుకెళ్లి..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

Bihar News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. అంతా బాగుందనుకున్న సమయంలో.. అత్తగారు బైకు కొనివ్వలేదనే కారణంతో.. Cruelty husband: అప్పులు తీర్చడం కోసం భార్యనే బలిపశువును చేశాడు. కొందరు యువకులతో కలిసి అతడు చేసిన నిర్వాకం.. Anand Mahindra Tweet: చూసేందుకు పిచ్చుక గూడే.. అందులోని టెక్నాలజీ చూస్తే మతి పోవాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే.. videoFunny video: అందుకే దీన్ని గుడ్లగూబ అనేది.. రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను పసిగట్టి.. ఏం చేసిందంటే.. videoబావ Birthday వేడుకలకు వెళ్తుండగా.. భర్త ఎదుటే భార్యను చేయి పట్టుకున్న యువకులు.. చివరకు అంతా చూస్తుండగా..girlfriend వద్దకు ఫ్రెండ్స్‌ని పంపించిన police Constable.. సామాన్లు ఇంట్లో పెట్టి వెళ్తామని చెప్పి.. లోపల వారు చేసిన నిర్వాకం..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.