Viral Video: ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..

Published: Sun, 03 Jul 2022 19:21:59 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: ఆడామగా తేడా లేకుండా పిచ్చి పిచ్చిగా కొట్టుకున్న జంటలు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అని అంటున్న నెటిజన్లు..

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. కాస్త విభిన్నంగా ఉండే వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సాధారణంగా మగవారు కొట్టుకోవడం చూశాం.. అలాగే ఆడవారు కొట్టుకోవడం కూడా చూశాం. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఆడామగా తేడా లేకుండా.. అంతా కలిసి పిచ్చిపిచ్చిగా కొట్టుకున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. వీళ్లకేం పోయే కాలంరా నాయనా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

ట్విట్టర్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. న్యూయార్క్‌లోని ఓ క్రూయిజ్‌ షిప్‌లో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 60 నుంచి 70 ప్రేమ జంటలు, దంపతులు పార్టీలో పాల్గొన్నాయి. ఫుల్‌గా మందు కొట్టిన ప్రయాణికులు.. కొద్ది సేపు డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. తర్వాత ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ ఒక్కసారిగా గొడవ మొదలైంది. నువ్వు మోసం చేశావ్.. అంటే నువ్వు మోసం చేశావ్.. అంటూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆడామగా తేడా లేకుండా ఒకరిమీద ఒకరు పడుతూ.. దుస్తులు చించుకుంటూ రచ్చ రచ్చ చేశారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. వీళ్లకేమైనా పిచ్చి పట్టిందా.. అని కొందరు, మందు ఎక్కువై మూర్ఖుల్లా ప్రవర్తిస్తున్నారు.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటున్న కోతి, పిల్లి.. స్నేహం అంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

భర్తే కదా అని.. అతడి ముందే దుస్తులు మార్చుకున్న భార్య.. అయితే ఆమెకు తెలీదు.. అవన్నీ వీడియోల రూపంలో ఉన్నాయని.. చివరకు..స్కూటీని తోసుకుంటూ వెళ్తున్న బాలికలను చూసి.. పెట్రోల్ తీసుకొద్దామంటూ ఒకరిని బైక్‌పై ఎక్కించుకున్నాడు.. చివరకు పర్సు మర్చిపోయానంటూ..మీ కూతురు ఉరి వేసుకుందంటూ.. తల్లిదండ్రులకు స్థానికుల నుంచి ఫోన్.. పోలీసు విచారణలో వెలుగులోకి వచ్చిన అసలు నిజం.. మీ భార్య మెట్లపై నుంచి జారి పడింది.. అంటూ స్థానికుల నుంచి ఫోన్.. భర్త కంగారుగా ఇంటికి వెళ్లి చూసేసరికి.. పిల్లలను ఆస్పత్రి వద్ద వదిలి.. ప్రియుడితో వెళ్లిన తల్లి.. తండ్రి కూడా ఎంతకీ రాకపోవడంతో.. పాపం చివరకు చిన్నారుల పరిస్థితి..ఒకరికొకరు నచ్చడంతో త్వరలో పెళ్లి చేయాలనుకున్నారు. రోజూ కాబోయే భర్తతో మాట్లాడుతున్న యువతి.. చివరకు ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.