Viral Video: అబ్బా! చేపల వేటకు వెళ్తే.. సీన్ రివర్స్ అయ్యిందే.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

ABN , First Publish Date - 2022-08-27T03:19:37+05:30 IST

అనుకున్నది ఒకటైతే.. అయ్యింది మరోటి అన్నట్లుగా.. కొన్నిసార్లు చివరకు అంతా తలకిందులు అవుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు...

Viral Video: అబ్బా! చేపల వేటకు వెళ్తే.. సీన్ రివర్స్ అయ్యిందే.. నవ్వులు పూయిస్తున్న వీడియో..

అనుకున్నది ఒకటైతే.. అయ్యింది మరోటి అన్నట్లుగా.. కొన్నిసార్లు చివరకు అంతా తలకిందులు అవుతుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉంది కాబట్టి.. ఇలాంటి వీడియోలు కోకొళ్లలుగా దర్శనమిస్తుంటాయి. వీటిలో కొన్ని వీడియోలు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని వీడియోలు తెగ నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. చేపల వేటకు వెళ్లిన యువకుడు.. చివరకు షాక్ తిన్నాడు. 


ట్విట్టర్‌లో (Twitter) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇధ్దరు వ్యక్తులు చేపల వేటకు (fishing) వెళ్తారు. ఓ బాలుడు నది ఒడ్డున ఉండగా, మరో వ్యక్తి గాలం వేసే క్రమంలో పొరపాటున నీటిలో పడిపోతాడు. నీటి లోపల ఓ చేప అతన్ని పట్టుకోరాని చోట పట్టుకుని ఉంటుంది. దీంతో తీవ్ర ఇబ్బందికి గురవుతాడు. వెంటనే పక్కనున్న బాలుడు అతన్ని పైకి లాగుతాడు. చివరకు చేపతో పాటూ అతనూ పైకి వస్తాడు. అయినా ఆ చేప మాత్రం అతన్ని వదలదు. దాని నుంచి విడిపించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాడు. చివరకు పక్కనున్న బాలుడు కూడా చేపను గట్టిగా పట్టుకుని లాగుతాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న మరికొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. చేప మనిషినే వేటాడిందంటూ కొందరు.. ఈ చేపకు బాగా కసి ఉన్నట్టుందే.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral news: వెంటబడి మరీ యువతుల కాళ్లు పట్టుకున్న యువకులు.. కరుణించమంటూ వేడుకోలు.. విషయం తెలిసి అంతా నవ్వులే నవ్వులు..





Updated Date - 2022-08-27T03:19:37+05:30 IST