Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి బిత్తర పోయిన వధువు.. ఇంతకీ ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-06-29T02:25:05+05:30 IST

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఆసక్తికర వీడియోలు

Viral Video: పెళ్లిలో వరుడు చేసిన పనికి బిత్తర పోయిన వధువు.. ఇంతకీ ఏం చేశాడంటే..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు, ఆసక్తికర వీడియోలు ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ  వీడియోలో ఓ పెళ్లి రిసెప్షన్ జరుగుతోంది. ఆ వేడుకలో వరుడు చేసిన పనికి వధువు బిత్తరపోయింది. 




పెళ్లి వేడుకలో వధూవరులు అందంగా తయారయ్యారు. బంధువులు, స్నేహితులు భారీగా హాజరయ్యారు. అందరూ చూస్తుండగా రిసెప్షన్ వేదికపైనే వధువు కాళ్లకు వరుడు దండం పెట్టాడు. దీంతో వధువు షాకై నవ్వేసింది. అనంతరం వధువు మెడలో వరుడు వరమాల వేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరుడు చేసిన పనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. 

Updated Date - 2022-06-29T02:25:05+05:30 IST