Government schools: పాఠశాలలోని పరిస్థితిని కళ్లకు కట్టిన విద్యార్థి.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-08-07T01:04:25+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా గ్రామాల్లో కనీస వసతులు (Minimum facilities) లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల (Government schools) పరిస్థితి..

Government schools: పాఠశాలలోని పరిస్థితిని కళ్లకు కట్టిన విద్యార్థి.. వీడియో చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

ప్రస్తుత టెక్నాలజీ యుగంలోనూ చాలా గ్రామాల్లో కనీస వసతులు (Minimum facilities) లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలల (Government schools) పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వసతుల కొరతతో చాలా పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా కొన్నిచోట్ల పరిస్థితులు మాత్రం మారడం లేదు. జార్ఖండ్‌లో ఓ పాఠశాలలో కూడా పలు సమస్యలు తిష్టవేశాయి. దీంతో విసుగొచ్చిన ఓ విద్యార్థి.. సోషల్ మీడియా (social media) వేదికగా సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ (Viral) అవుతోంది.


జార్ఖండ్ (Jharkhand) రాష్ట్రం గొడ్డా జిల్లా పరిధి గొడ్డాలోని మహ్గామా బ్లాక్‌లో ఉన్న భిఖియాచక్ ప్రాథమిక పాఠశాలలో సమస్యలు తిష్టవేశాయి. దీంతో విద్యార్థుల శాతం కూడా తగ్గిపోయింది. దీన్నంతా గమనించిన ఓ 12ఏళ్ల విద్యార్థి రిపోర్టర్ అవతారం ఎత్తాడు. ఓ ప్లాస్టిక్ బాటిల్‌కు కర్ర తగిలించి మైక్ తరహాలో తయారు చేశాడు. దాన్ని పట్టుకుని సమస్యలను చూపిస్తూ.. వాటిని తోటి విద్యార్థులతో వివరించడం.. అందరినీ ఆకట్టుకుంది. ‘‘ మా గ్రామంలో అప్‌గ్రేడ్ చేయబడిన పాఠశాల పరిస్థితి గురించి మీకు వివరిస్తా. విద్యార్థులకు కనీసం తాగడానికి నీరు కూడా లేదు.

ten years కష్టం ఫలించిందంటూ యువకుడి మెసేజ్.. మమ్మల్ని ఆశీర్వదించావ్.. అంటూ బదులిచ్చిన ఆనంద్ మహీంద్రా.. విషయం ఏంటంటే..


‘‘పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. మరుగుదొడ్లు (Toilets) చాలా అధ్వానంగా ఉన్నాయి. తరగతి గదుల్లో పశువుల మేతను పడేస్తున్నారు. ఇక ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు సక్రమంగా రావడం లేదు’’.. అంటూ తమ పాఠశాలలోని దుస్థితిని చక్కగా వివరించాడు. పక్కనే ఉన్న ఓ వ్యక్తి దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించాలని కామెంట్లు పెడుతున్నారు.

Digital payments: ఆన్‌లైన్ పేమెంట్స్ ద్వారా ఇంతమంది నష్టపోతున్నారా.. సర్వేలో షాకింగ్ వాస్తవాలు..





Updated Date - 2022-08-07T01:04:25+05:30 IST