Viral Video: ఈ గొరిల్లా తల్లి ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. అచ్చం మనుషుల్లాగే చేస్తోంది చూడండి..

ABN , First Publish Date - 2022-07-30T02:53:31+05:30 IST

మనుషులను అనుకరించడంలో గొరిల్లాకు మించిన జంతువులు ఉండవు. అచ్చం మనుషుల తరహాలోనే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్...

Viral Video: ఈ గొరిల్లా తల్లి ప్రేమను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.. అచ్చం మనుషుల్లాగే చేస్తోంది చూడండి..

మనుషులను అనుకరించడంలో గొరిల్లాకు మించిన జంతువులు ఉండవు. అచ్చం మనుషుల తరహాలోనే పనులు చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ గొరిల్లా చూపించిన తల్లి ప్రేమను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పిల్లలను తల్లి ఎలా లాలిస్తుందో.. అచ్చం అలాగే చేసిన గొరిల్లా అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 


ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. కెనడాలోని ఓ జూ పార్కులో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్ని జంతువులనూ చూస్తున్న సందర్శకులు గొరిల్లా వద్దకు వచ్చేసరికి అలాగే ఆగిపోయారు. పిల్లను ఒడిలో పెట్టుకున్న గొరిల్లా చూపించిన తల్లిప్రేమ అందరినీ ఆకట్టుకుంది. పిల్ల గొరిల్లాను పైకి ఎత్తుకుని అటూ, ఇటూ తిప్పుతుంది. తర్వాత ఒడిలో పెట్టుకుని ప్రేమగా ముద్దు పెడుతుంది. ఏడుస్తున్న పిల్లలను తల్లి ఎలా లాలిస్తుందో.. గొరిల్లా కూడా అచ్చం అలాగే చేయడంతో అంతా అలాగే చూస్తుండిపోయారు. ఈ వీడియోను సోషల్ మీడియలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ ఒకేలా ఉంటుంది.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఏ బిడ్డా.. ఇది మా అడ్డా! మామూళ్లు ఇవ్వకుంటే మామూలుగా ఉండదు.. చెరకు లారీని ఏనుగులు ఏం చేశాయంటే..





Updated Date - 2022-07-30T02:53:31+05:30 IST