Viral Video: horse riding అదరగొడుతున్న కుక్కపిల్ల.. చూస్తే సినిమా సీన్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు..

ABN , First Publish Date - 2022-07-18T02:06:56+05:30 IST

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల్లా ప్రవర్తించే జంతువుల వీడియోలు..

Viral Video: horse riding అదరగొడుతున్న కుక్కపిల్ల.. చూస్తే సినిమా సీన్ గుర్తుకొస్తుందంటున్న నెటిజన్లు..

జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. మనుషుల్లా ప్రవర్తించే జంతువుల వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. గుర్రం ఎక్కిన కుక్కపిల్ల అచ్చం మనుషుల్లా స్వారీ చేయడం అందరినీ ఆకట్టకుంటోంది..


Twitter లో ఓ వీడియో వైరల్ అవుతోంది. రద్దీగా ఉన్న రోడ్డుపై గుర్రం పరుగెడుతూ ఉంటుంది. ఇందులో విశేషమేమీ లేదుగానీ.. దానిపై ఓ కుక్క పిల్ల నిలబడి ఉండడాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా, భయం లేకుండా గుర్రంపై అది నిలబడ్డ తీరు.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చాలా దూరం వెళ్లాక సిగ్నల్ వద్ద గుర్రం ఆగుతుంది. అయినా కుక్క పిల్ల మాత్రం అలాగే గుర్రంపై నిలబడి ఉంటుంది.

Viral Video: పంతం నీదా.. నాదా.. సై!.. అంటూ పోటీపడ్డ మనిషి, మేక.. చివరికి విజయం ఎవరిదంటే..


మొదటి నుంచి గుర్రం పక్కనే ఓ వ్యక్తి బైకుపై వెళ్తూ గమనిస్తుంటాడు. కానీ కుక్క పిల్ల మాత్రం ఎక్కడా కిందపడకుండా గుర్రపు స్వారీ చేసి, అందరితో శభాష్ అనిపించుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. PAW Patrol అనే కెనడియన్ కామెడీ షో గుర్తుకు వస్తుందంటూ చాలామంది కామెంట్ చేస్తుంటే.. బాలీవుడ్ Welcome సినిమాలో ఇలాంటి సన్నివేశం ఒకటి గుర్తుకొచ్చిందంటూ చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఇంటి ఎదుట ఇద్దరు మహిళ మధ్య ఫైట్.. చెత్త విషయంలో మరీ ఇంత చెత్తగానా..





Updated Date - 2022-07-18T02:06:56+05:30 IST