Viral Video: దున్నపోతుకు మేత వేస్తూ.. యువతి వెకిలి చేష్టలు.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..

ABN , First Publish Date - 2022-08-22T01:21:53+05:30 IST

ప్రస్తుత యువత పిచ్చి ఫీక్స్‌కు వెళుతోంది. ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు..

Viral Video: దున్నపోతుకు మేత వేస్తూ.. యువతి వెకిలి చేష్టలు.. చివరకు ఏమయ్యిందో మీరే చూడండి..

ప్రస్తుత యువత పిచ్చి ఫీక్స్‌కు వెళుతోంది. ఎలాగైనా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ యువతి దున్నపోతు ముందు వెకిలి చేష్టలు చేస్తూ డ్యాన్స్ చేసింది. దీంతో దున్నపోతుకు చిర్రెత్తుకొచ్చి.. ఒక్కటిచ్చింది. దెబ్బకు ఎగిరి తొట్టిలో పడింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 


ఇన్‌స్టాగ్రాంలో (Instagram) ఓ వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఓ యువతి దున్నపోతుకు మేత వేసేందుకు వెళ్తుంది. పక్కనే ఉన్న ఇంకో వ్యక్తి ఫోన్‌లో వీడియో తీస్తుంటాడు. మేత వేసిన తర్వాత దాని ముందు వెకిలి చేష్టలు చేస్తూ.. డ్యాన్స్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. రెండు, మూడు స్టెప్పులు వేయగానే దున్నపోతుకు చిర్రెత్తుకొస్తుంది. ఏంటీ పిచ్చి చేష్టలు.. అని అన్నట్లుగా తలతో గట్టిగా ఒక తోపు తోస్తుంది. దీంతో ఆ యువతి ఎగిరి పక్కనే ఉన్న నీళ్ల తొట్టిలో పడుతుంది. అంతటితో శాంతించడంతో హమ్మయ్య! అని అనుకుంటూ ఆమె అక్కడి నుంచి పరుగందుకుంటుంది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. దున్నపోతు బాగా బుద్ధి చెప్పిందంటూ కొందరు.. ప్రతిదానికీ ఓ హద్దు అంటూ ఉంటుంది.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఎద్దుకు కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో.. వామ్మో! చివరకు రచ్చ రచ్చ చేసిందిగా..





Updated Date - 2022-08-22T01:21:53+05:30 IST