Viral Video: పాత తరం పనిముట్టే అయినా.. ఎంత పక్కాకా పని చేస్తోందో చూడండి...

Published: Thu, 28 Jul 2022 20:07:54 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video: పాత తరం పనిముట్టే అయినా.. ఎంత పక్కాకా పని చేస్తోందో చూడండి...

ప్రస్తుత హైటెక్ యుగంలో ప్రతీ రంగంలో సాంకేతికత (Technology) అభివృద్ధి చెందింది. ప్రపంచమే అరచేతిలోకి వచ్చి వాలడంతో పాటూ మనుషుల అవసరం లేకుండా చాలా పనులను యంత్రాలు, రోబోలే చేసేస్తున్నాయి. ఇప్పుడంటే ఇలాంటి సౌలభ్యం ఉంది కానీ.. పెద్దల కాలంలో పరిస్థితి ఎలా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే టెక్నాలజీ అందుబాటులోని అప్పటి కాలంలో పల్లెల్లో వివిధ పనులకు వినియోగించే వస్తువులను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాత తరం పనిముట్టును చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన ప్రముఖ వ్యాపారవేత్త (businessman) ఆనంద్ మహీంద్ర (Anand Mahindra).. ఆ వీడియోను తన ట్విటర్ (Twitter) ఖాతా ద్వారా షేర్ చేశారు. 

వడ్లు, జొన్నలు తదితరాలను దంచేందుకు అప్పట్లో రోళ్లను వినియోగించేవారని అందరికీ తెలుసు. అయితే రోకలితో దంచేందుకు మనిషి అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా ఏర్పాటు చేసిన పరికరం అందరినీ ఆకట్టుకుంటోంది. రోకలి ఆకారంలో ఉన్న ఓ కర్రను చక్రాలకు అనుసంధానం చేశారు. అదేవిధంగా నీళ్లు మీద పడగానే చక్రం తిరిగేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా ఇంజిన్, మనుషులతో పని లేకుండా ఈ రోకలి పని చేస్తుందన్నమాట. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వినూత్న ఆవిష్కరణలను ఇష్టపడే ఆనంద్ మహీంద్రాకు.. ఈ పాతతరం పరికరం తెగ నచ్చేసిందట. ఈ పరికరం సమర్థవంతమైనదే కాకుండా అందమైనది.. అని వ్యాఖ్యానిస్తూ వీడియోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చాలా అద్భుతంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగాన్ని వద్దనుకున్నాడు.. ఇప్పుడు అతడికి ప్రతీ రోజూ రూ.2.40 లక్షలు.. అమెరికా, జపాన్ నుంచి కూడా ఆర్డర్లు..! 



ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఈ స్కూల్‌కు వెళ్లాలంటే పుస్తకాలతో పాటు.. గొడుగులు కూడా తీసుకెళ్లాల్సిందే..!Wife Tortured Husband: స్టేషన్‌కు వచ్చిన 73 ఏళ్ల వృద్ధుడు చెప్పింది విని నివ్వెరపోయిన పోలీసులు.. ఏడాది క్రితమే రెండో పెళ్లయిందంటూ..Viral Video: సముద్రం మీదుగా వెళ్తున్న పైలట్‌‌కు షాకింగ్ అనుభవం.. ఎర్రటి మచ్చలు చూసి షాకవుతున్న నెటిజన్లు.. videoHarassment: అశ్లీల వీడియోలో ఉన్నది నేను కాదంటూ మహిళ మొత్తుకుంటున్నా వినిపించుకోని యువకులు.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయంతో.. Wife planned: భార్య హత్య కేసులో భర్త అరెస్ట్.. నెలన్నర తర్వాత అనుకోకుండా మహిళ ప్రత్యక్షం.. ఇంతకీ ఆమె చేసిన పనేంటంటే..భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆస్పత్రిలో వారు చేసిన నిర్వాకం తెలుసుకుంటే.. వామ్మో అని మీరే అంటారు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.