Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..

ABN , First Publish Date - 2022-08-20T00:36:37+05:30 IST

కొందరు ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల సంక్షేమం కోసం శ్రమిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో..

Viral Video: ఓ వైపు వర్షం.. మరో వైపు వరద.. మధ్యలో నడి రోడ్డుపై ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడో చూడండి..

కొందరు ఎలాంటి స్వార్థం లేకుండా ఇతరుల సంక్షేమం కోసం శ్రమిస్తుంటారు. ప్రస్తుత సమాజంలో ఇలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది కాబట్టి.. ఇలాంటి అరుదైన వ్యక్తుల గురించి ఇట్టే తెలిసిపోతోంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటిదే. ఓ వైపు వర్షం పడుతుండగా.. మరోవైపు రోడ్డుపై వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన ఓ పెద్దాయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా చీపురు పట్టుకుని నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తాడు. ఈయన మానవత్వానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


బ్రిటన్‌లో (Britain) ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు చోట్ల వరదలు (floods) ముంచెత్తుతున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లండన్‌లోని (London) పలు వీధుల్లోకి వరద నీరు పోటెత్తింది. ఓ రోడ్డుపై వరద నీరు ప్రవాహం ఎక్కువ అవడంతో వాహనదారులు (Motorists) తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీన్ని గమనించిన వృద్ధుడు చలించిపోయాడు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీపురు పట్టుకుని రోడ్డుపైకి వెళ్లాడు. వరద నీరు డ్రైన్‌లోకి వెళ్లేలా చీపురుతో ఊడ్చడం మొదలెట్టాడు. వర్షంలో తడుస్తూనే వరద నీటిని రోడ్డు పక్కకు మళ్లించేందుకు చాలా సేపు శ్రమించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ పెద్దాయన రియల్ హీరో.. అంటూ ఒకరు, ఈ వయసులోనూ అతడి సమాజిక చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది.. అంటూ మరొకరు కామెంట్లు పెడుతున్నారు. 

Viral Video: ఈ ఏనుగుది ఎంత మంచి మనసు.. కింద పడ్డ వస్తువును ఏం చేసిందో చూడండి..





Updated Date - 2022-08-20T00:36:37+05:30 IST