Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో...

Published: Tue, 09 Aug 2022 21:42:05 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Funny video: పెళ్లి పీటల మీదే ఇలా ఉంటే.. వివాహానంతరం వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో...

వివాహ సమయాల్లో చోటు చేసుకునే సరదా సరదా సంఘటనలు సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral videos) అవుతుంటాయి. కొందరు ఫేమస్ కావాలనే ఉద్దేశంతో ప్రాంక్ వీడియోలు (Prank videos) చేస్తుంటారు. వధూవరుల మధ్య చోటు చేసుకునే చిలిపి చిలిపి ఘటనలు కొన్నిసార్లు సీరియస్ అవుతుంటాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లి పీటల మీద అందరి ముందే వధూవరుల మధ్య సరదా సంఘటన చోటు చేసుకుంది. తర్వాత అది కొంచెం సీరియస్ అయింది. చివరకు మండపంలో అంతా పగలబడి నవ్వుకున్నారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. 

ఓ వివాహ వేడుకలో (wedding ceremony) వధూవరులు పీటలపై కూర్చుని ఉంటారు. ఆ సమయంలో వధువు చేతిలో ఉన్న ప్లేటును అందుకునేందుకు వరుడు ప్రయత్నిస్తాడు. దీంతో వధువు అతన్ని పక్కకు నెడుతుంది. తర్వాత వరుడు కూడా వధువు మొఖంపై చేయి వేసి పక్కకు నెట్టేస్తాడు. దీంతో వధువుకు ఒక్కసారిగా చిర్రెత్తుకొస్తుంది. పెళ్లి మంటపమని కూడా చూడకుండా వరుడి పైకి దూసుకెళ్తుంది. అతన్ని కింద పడేసి మరీ దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. వరుడు మాత్రం నవ్వుతూ ఉండగా, వధువు కాస్త సీరియస్‌గా కనిపించింది. పక్కనున్న వారు వీరిని చూసి పగలబడి నవ్వుకున్నారు. అక్కడే ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘‘ఈ దంపతులు ఇప్పుడే ఇలా ప్రవర్తిస్తుంటే.. ఇక వివాహానంతరం ఎలా సంసారం చేస్తారో.. ఏమో’’.. అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

extramarital affair: ప్రియుడిని రోజూ కలవాలనే ఉద్దేశంతో.. ఇంట్లో పిల్లలు చూస్తుండగా మహిళ చేసిన నిర్వాకం.. Atrocity on girlfriend: రాత్రి వేళ ఇంట్లోకి వచ్చిన ప్రియుడు, అతడి స్నేహితుడు.. కాసేపటికి యువతి కాళ్లు, చేతులు కట్టేసి మరీ.. Suspicious Women: ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ.. పోలీసులకు అనుమానం వచ్చి.. ఆమె సూట్‌కేస్‌ను తెరచి చూడగా.. Dubai jobs scam: దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. పాకిస్థాన్‌కు పంపించిన ఏజెంట్.. 20ఏళ్ల తర్వాత వృద్ధురాలి పరిస్థితి ఏంటంటే.. Viral Video: కదులుతున్న రైలును ఎక్కేందుకు ప్రయత్నించిన తల్లీకొడుకు.. అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ గుర్తించడంతో.. videodrunk woman: యువకుడితో పాటూ ఫుల్‌గా మందుకొట్టిన మహిళ.. అదే సమయంలో పిల్లలు వీడియో తీయడంతో.. చివరకు..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.