Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..

ABN , First Publish Date - 2022-08-08T02:14:15+05:30 IST

వివాహ సమయాల్లో ఫన్నీ ఫన్నీ ఘటనలు (Marriage funny videos) చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్..

Marriage funny video: పాపం ఏ పెళ్లికూతురికీ రాని కష్టం వచ్చిందే.. పక్కనున్న వారంతా నవ్వుతుంటే.. చివరకు ఎలాగోలా..

వివాహ సమయాల్లో ఫన్నీ ఫన్నీ ఘటనలు (Marriage funny videos) చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వధూవరులను స్నేహితులు ఆటపట్టించడం, కొన్నిసార్లు వధువుపై వరుడు ప్రాంక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఏ వివాహ కార్యక్రమంలో చూసినా ఏదో ఒక తమాషా ఘటన చోటు చేసుకోవడం చూస్తున్నాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి వైరల్ (Viral video) అవుతోంది. పెళ్లికూతురు వరుడి మెడలో దండ వేసేందుకు తెగ ఇబ్బంది పడుతుంది. ఈమెను చూసిన నెటిజన్లు.. పాపం ఏ వధువుకూ రాని కష్టం వచ్చిందే అంటూ కామెంట్లు పెడుతున్నారు.


ఇన్‌స్టాగ్రాంలో (Instagram viral videos) ఓ వీడియో వైరల్ అవుతోంది. వివాహ మండపంలోని వేదికపై వధూవరులు దండలు మార్చుకుంటుంటారు. అయితే వరుడు సుమారు 7అడుగులు పైనే ఎత్తు ఉండడం, వధువు కేవలం 5అడుగులే ఉండడంతో సమస్య తలెత్తింది. వధువు దండ వేయాల్సిన సమయం రాగానే పక్కనున్న వారంతా నవ్వడం మొదలెడతారు. అంత ఎత్తున్న భర్త మెడలో దండ ఎలా వేయాలో తెలీక.. ఆమె చాలాసేపు అలాగే నిల్చుంటుంది. పక్కన ఉన్నవారు దండ వేయమని ప్రోత్సహించడంతో ప్రయత్నిస్తుంది. ఎలాగోలా పైకి ఎగిరి మొత్తానికి దండ వేస్తుంది. తర్వాత వరుడు మాత్రం వధువు మెడలో దండను ఈజీగా వేసేస్తాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఈ పిల్లల సాహసం చూస్తే.. శభాష్ అని తీరాల్సిందే.. పెంపుడు కుక్క కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా..





Updated Date - 2022-08-08T02:14:15+05:30 IST