గ్రామంలో వింత ఆచారం.. రెండు పెళ్లిళ్లు చేసుకుంటేనే పిల్లలు పుడతారట..!

ABN , First Publish Date - 2022-02-26T22:00:46+05:30 IST

ఆ గ్రామంలో కొన్నేళ్లుగా వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి వ్యక్తీ రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ ఆనవాయితీ. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికే పిల్లలు పుడతారట. ఈ ఆచారాన్ని పాటించకపోతే ఎట్టిపరి

గ్రామంలో వింత ఆచారం.. రెండు పెళ్లిళ్లు చేసుకుంటేనే పిల్లలు పుడతారట..!

ఇంటర్నెట్ డెస్క్: ఆ గ్రామంలో కొన్నేళ్లుగా వింత ఆచారం కొనసాగుతోంది. ప్రతి వ్యక్తీ రెండు పెళ్లిళ్లు చేసుకోవడం అక్కడ ఆనవాయితీ. ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తికే పిల్లలు పుడతారట. ఈ ఆచారాన్ని పాటించకపోతే ఎట్టిపరిస్థితుల్లో ఆ వ్యక్తికి పిల్లలు పుట్టరట. వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఆ గ్రామ ప్రజలు మాత్రం దీన్ని బలంగా నమ్ముతున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



రాజస్థాన్‌లోని బార్మర్ జిల్లాలో డేరాసర్ అనేది మారుమూల గ్రామం. ఈ గ్రామంలో కేవలం 100 ముస్లిం కుటుంబాలు మాత్రమే ఉంటాయి. కానీ ఈ గ్రామ ప్రజలు అనాదిగా ఓ ఆచారం పాటిస్తున్నారు. ఇక్కడ ప్రతి వ్యక్తికి రెండు పెళ్లిళ్లు తప్పనిసరి. ఒకవేళ ఎవరైనా ఈ సంప్రదాయాన్ని ఎవరైనా విస్మరించి.. రెండో పెళ్లి చేసుకోకుంటే వాళ్లకు అసలు పిల్లలే పుట్టరనేది అక్కడి వారి నమ్మకం. మొదటి భార్యతోనే సరిపెట్టుకున్న కొంత మందికి ఇప్పటికీ పిల్లలు పుట్టలేదని కూడా అక్కడి ప్రజలు చెబుతున్నారు. గ్రామంలోని సంప్రదాయం కారణంగా మొదటి భార్య కూడా తన భర్త రెండో పెళ్లి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం చెప్పదట. పైగా భర్తను రెండో పెళ్లి చేసుకున్న ఆ మహిళను తన సొంత చెల్లిలా చూసుకుంటుందట. రెండో భార్యగా వచ్చిన ఆ మహిళ కూడా తన భర్త మొదటి భార్యను సొంత అక్కలా భావిస్తుందట. టెక్నాలజీలో ప్రపంచ దూసుకుపోతున్నా.. అక్కడి ప్రజలు మాత్రం ఈ ఆచారాన్ని ఇప్పటికీ ఫాలో అవడం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది.




Updated Date - 2022-02-26T22:00:46+05:30 IST