యాప్‌లతో ఉపాధ్యాయుల సమయం వృథా

ABN , First Publish Date - 2022-08-19T06:43:35+05:30 IST

పాఠశాలల్లో యాప్‌ల వల్ల సమయం వృథా కావడమే కాకుండా విద్యాబోధన కుంటుపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లా డుతూ వ్యక్తిగత సెల్‌ఫోన్లతో ఉపాధ్యాయులు హాజరు వేసుకోవడం వల్ల వారి వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.

యాప్‌లతో ఉపాధ్యాయుల సమయం వృథా
సమావేశంలో మాట్లాడుతున్న నాగజగదీశ్వరరావు

 కుంటుపడుతున్న విద్యాబోధన 

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు ‘బుద్ద’

అనకాపల్లి అర్బన్‌, ఆగస్టు 18: పాఠశాలల్లో యాప్‌ల వల్ల సమయం వృథా కావడమే కాకుండా విద్యాబోధన కుంటుపడుతుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లా డుతూ వ్యక్తిగత సెల్‌ఫోన్లతో ఉపాధ్యాయులు హాజరు వేసుకోవడం వల్ల వారి వ్యక్తిగత సమాచారం బహిర్గతమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, పాఠశాలల్లో నెట్‌వర్క్‌ సక్రమంగా లేకపోవడం వల్ల ఉపాధ్యాయులు హాజరు కోల్పోయే అవకాశముందన్నారు. పాఠశాలకు వెళ్ళినప్పటి నుంచి యాప్‌ల వల్ల ఒకపూటంతా సమయం వృథాగా పోతోందన్నారు. యాప్‌లను తొలగించి పూర్వం మాదిరిగా ఉపాధ్యాయులకు పాఠాలు చెప్పుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో రిటైర్డ్‌ ఉపాధ్యాయులు బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, సత్యనారాయణ పాల్గొన్నారు. 

‘ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు కుట్ర’ 

అనకాపల్లి టౌన్‌: ప్రభుత్వ విద్యను దూరం చేసేందుకు, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుతున్న దుష్టపన్నాగాలను ప్రజలంతా తిప్పికొట్టాలని సీపీఎం జిల్లా ప్రతినిధి ఎ.బాలకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం ఆయన ఇక్కడి విలేఖర్లతో మాట్లాడుతూ నూతన విద్యా విధానం పేరుతో పేదలకు విద్యను దూరం చేయడానికి పాలకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. ఇందులో భాగంగా కేంద్రం సూచించిన అంశాలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తుండడం దారుణమన్నారు.  

యాప్‌ను నిలిపివేయాలని ఎమ్మెల్యేకు వినతి

ఎస్‌.రాయవరం: ఉపాధ్యాయుల అటెండెన్స్‌ యాప్‌ను నిలిపివేయాలని కోరుతూ  పీఆర్‌టీయూ మండల అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, జిల్లా కౌన్సిలర్‌ ప్రకాష్‌, ప్రసాద్‌, జాన్‌ తదితర ఉపాధ్యాయులు గురువారం మండలంలోని కొరుప్రోలు క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు వినతి పత్రం అందజేశారు.  అటెండెన్స్‌ యాప్‌ వల్ల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరిం చారు. 

Updated Date - 2022-08-19T06:43:35+05:30 IST