పెళ్లి వేదికపై వధూవరులిద్దరూ చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు.. మొదట అంతా విస్మయం.. ఆ తర్వాత..

ABN , First Publish Date - 2022-04-22T21:09:01+05:30 IST

సాధారణంగా పెళ్లి వేడుక అంటే బంధుమిత్రుల కోలాహలంతో ఎంతో సంతోషంగా, వైభవంగా జరుగుతుంది.

పెళ్లి వేదికపై వధూవరులిద్దరూ చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు.. మొదట అంతా విస్మయం.. ఆ తర్వాత..

సాధారణంగా పెళ్లి వేడుక అంటే బంధుమిత్రుల కోలాహలంతో ఎంతో సంతోషంగా, వైభవంగా జరుగుతుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని చందౌలికి చెందిన ఓ యువకుడు ఎంతో ఆదర్శవంతంగా వివాహం చేసుకున్నాడు. తన వివాహ వేడుకలోనే రక్తదాన కార్యక్రమం, అనాథలకు అన్నదానం ఏర్పాటు చేశాడు. వివాహానికి ముందు వధూవరులిద్దరూ రక్తదానం చేశారు. వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టి, పెద్దల ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏడడుగులు వేశారు. వధూవరులతో పాటు పెళ్లికి వచ్చిన ఇరు కుటుంబాలు, వారి స్నేహితులు కూడా రక్తదానం చేశారు. 


ఇది కూడా చదవండి:

Viral Video: పెళ్లి వేడుకలో ఇతడి డాన్స్ చూసి నవ్వాపుకోలేరు.. నెట్టింట ఎన్ని ఫన్నీ కామెంట్లో..!


ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిన అజిత్ సోనీ, ప్రియాంక గుప్తాల వివాహం ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది. అజిత్, అతని స్నేహితులు ఎప్పట్నుంచో ఒక సామాజిక సేవా సంస్థను నడుపుతున్నారు. అజిత్ ఎప్పటికప్పుడు రక్తదానం చేస్తూనే ఉంటాడు. అయితే వివాహ వేడుకలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి.. అక్కడ రక్తదానం శిబిరం ఏర్పాటు చేస్తే ఎక్కువ ఆదరణ ఉంటుందని ఆజిత్ భావించాడు. అలాగే రక్తదానం పట్ల ప్రజల్లో అవగాహన కూడా పెంచాలని అజిత్ భావించాడు. అజిత్ ఆలోచనను అతనికి కాబోయే భార్య కూడా అర్థం చేసుకుని సహకరించింది. 


అజిత్ బస్తీ పేద పిల్లలను ఈ వివాహానికి ఆహ్వానించి వారికి విందు భోజనం పెట్టాడు. సమాజం పట్ల ఈ జంట చూపిన బాధ్యతను అందరూ అర్థం చేసుకుని ప్రశంచారు. వివాహానికి హాజరైన బంధుమిత్రులు కూడా రక్తదానం చేశారు. తన వివాహ వేడుకలో జరగబోయే ఈ కార్యక్రమాల గురించి వివరిస్తూ అజిత్ శుభలేఖ కూడా వేయించడం విశేషం. 

Updated Date - 2022-04-22T21:09:01+05:30 IST